AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓవైపు కూటి కోసం, మరోవైపు బిడ్డల భవిష్యత్తు కోసం.. ఈ తల్లి కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు

ట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో మాతృతం గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. కన్నతల్లికి తన బిడ్డలపై ఉండే మమకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ వీధిలో పండ్ల బండి పెట్టుకొని జీవనం సాగిస్తుంది. అదే సయంలో తన ఇద్దరు చిన్నారులు పండ్ల బండి పక్కనే కూర్చొని హోం వర్క్‌ చేసుకుంటున్నారు. అదే సమయంలో...

Viral Video: ఓవైపు కూటి కోసం, మరోవైపు బిడ్డల భవిష్యత్తు కోసం.. ఈ తల్లి కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు
Viral Video
Narender Vaitla
|

Updated on: Sep 02, 2023 | 10:39 AM

Share

ఆడతనం ఒక్కో చోట ఒక్కోలా ఉన్నా, అమ్మతనం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఇది ఓ సినిమాలోని డైలాగ్‌. అమ్మ గొప్పతనం చూస్తే ఇది ముమ్మాటికీ నిజం అనిపించడంలో ఎలాంటి సందేహం ఉండదు. తాను ఎలా ఉన్నా, తాను ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న తన పిల్లలను మాత్రం ఉన్నతంగా చూడాలని కోరుకుంటుంది. అందుకోసం తనలోని శక్తినంతా కూడదీసుకొని పోరు చేస్తుంది. సృష్టిలో ప్రతీ తల్లి ఇందుకోసమే జీవిస్తుంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసమే తపిస్తుంటుంది.

తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో మాతృతం గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. కన్నతల్లికి తన బిడ్డలపై ఉండే మమకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ వీధిలో పండ్ల బండి పెట్టుకొని జీవనం సాగిస్తుంది. అదే సయంలో తన ఇద్దరు చిన్నారులు పండ్ల బండి పక్కనే కూర్చొని హోం వర్క్‌ చేసుకుంటున్నారు. అదే సమయంలో పండ్లు అమ్ముతున్న ఆ తల్లి అప్పుడప్పుడు వచ్చి బిడ్డలకు హోం వర్క్‌ చేయడంలో సహాయం చేస్తుంది. తాను పడుతోన్న కష్టం తన చిన్నారులు పడకూడదని ఆ తల్లి చేస్తున్న పనికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండడం కష్టం.

ఇవి కూడా చదవండి

దీనంతటినీ అక్కడే ఉన్న ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. జార్ఖండ్‌ కేడర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ అనే ఐఏఎస్‌ అధికారి ఈ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన సంజయ్‌ కుమార్‌.. ‘నా దగ్గర మాటల్లేవు.. అమ్మకు వందనం’ అంటూ ఓ క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు ఎమోషన్‌ అవుతున్నారు. తల్లి గొప్పతనం అంటే ఇలాగే ఉంటుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..