Viral Video: కర్మఫలం అంటే ఇదేనేమో.! కుక్కను కొట్టాడు.. కట్ చేస్తే.. పరిగెత్తించి.. పిక్కలు లాగేసింది..
ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే..

ఇంటర్నెట్‌లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే నెట్టింట రోజూ లక్షల్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో ఓ యువకుడికి శునకం తన ప్రతాపాన్ని చూపించింది. దీన్ని చూశాక మీరూ కుక్కను ఊరుకనే టచ్ చేయడానికి కూడా భయపడతారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కను కొడతాడు. అంతే! ఆ శునకానికి చిర్రెత్తుకొస్తుంది. అతడిపై పడి, పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ పిక్కలు లాగేస్తుంది. ఆ శునకం దగ్గర నుంచి సదరు వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోతుంది. యజమాని వెనక్కి తగ్గించేందుకు చూసినా.. ఆ కుక్క అస్సలు వెనక్కి తగ్గదు. ఆ వ్యక్తిని పరిగెత్తించి.. మరీ పిక్కలపై కరుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని ‘cctvidiots’ అనే ట్విట్టర్ యూజర్ ఇంటర్నెట్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను 5.9 మిలియన్ మంది వీక్షించారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
Well done ?? pic.twitter.com/nkFH2W1OB9
— CCTV IDIOTS (@cctvidiots) May 23, 2023