AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election King: 238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా తగ్గేదేలే అంటూ మళ్లీ పోటీ, వరల్డ్ బిగ్గెస్ట్ లూజర్ గా రికార్డ్

Viral News: ఒకటి కాదు.. రెండు.. ఏకంగా 238 సార్లు ఓడాడు.. అయినా తగ్గేదేలే అంటూ ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ప్రజలు అతన్ని ఓడిస్తున్నా.. ఏమాత్రం తగ్గకుండా మళ్లీ పోటీలో నిలుస్తూ వలర్డ్ బిగ్గెస్ట్ లూజర్ గా సరికొత్తి రికార్డును క్రియేట్ చేశాడు. ప్రభుత్వ పదవి కోసం 238 సార్లు విఫలమైనప్పటికీ, కె.పద్మరాజన్ మరోసారి ఎన్నికలలో పోటీ చేయడానికి మరోసారి రెఢీ అంటున్నాడు.

Election King: 238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా తగ్గేదేలే అంటూ మళ్లీ పోటీ, వరల్డ్ బిగ్గెస్ట్ లూజర్ గా రికార్డ్
Padma Rajan
Balu Jajala
|

Updated on: Mar 28, 2024 | 4:34 PM

Share

ఒకటి కాదు.. రెండు.. ఏకంగా 238 సార్లు ఓడాడు.. అయినా తగ్గేదేలే అంటూ ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ప్రజలు అతన్ని ఓడిస్తున్నా.. ఏమాత్రం తగ్గకుండా మళ్లీ పోటీలో నిలుస్తూ వలర్డ్ బిగ్గెస్ట్ లూజర్ గా సరికొత్తి రికార్డును క్రియేట్ చేశాడు. ప్రభుత్వ పదవి కోసం 238 సార్లు విఫలమైనప్పటికీ, కె.పద్మరాజన్ మరోసారి ఎన్నికలలో పోటీ చేయడానికి మరోసారి రెఢీ అంటున్నాడు. 65 ఏళ్ల టైర్ల రిపేర్ షాప్ యజమాని 1988లో తన సొంత పట్టణమైన తమిళనాడులోని మెట్టూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అయితే మొదట ఇతను పోటీలో నిలిచినప్పుడు జనాలు నవ్వారు.

అయినా అతను ఏమాత్రం సిగ్గుపడకుండా పోటీలో నిలుస్తూనే ఉన్నాడు. అయితే తనకు గెలుపు పోటీలోనే ఉందని, ఓటమి అనివార్యంగా వచ్చినప్పుడు సంతోషంగా స్వీకరిస్తానని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని ఒక పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్నాడు. ఎలక్షన్ కింగ్ గా పేరొందిన పద్మరాజన్ రాష్ట్రపతి నుంచి స్థానిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్,  రాహుల్ గాంధీల చేతిలో ఓడిపోయారు. గెలుపోటములు ద్వితీయమైనవని, ‘ప్రత్యర్థి అభ్యర్థి ఎవరు? నేను పట్టించుకోను అంటూ చిరునవ్వుతో చెబుతారాయన. అయితే వరుస ఓటములు పలుకరిస్తున్నా పద్మరాజన్ వెనుకడగు వేయలేదు.

మూడు దశాబ్దాలకు పైగా నామినేషన్ ఫీజులో  వేలాది రూపాయలను ఖర్చు చేశాడు. అందులో 25,000 రూపాయలు (300 డాలర్లు) సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంది. అయితే ఇది అతను 16 శాతం కంటే ఎక్కువ ఓట్లు గెలుచుకుంటే తప్ప తిరిగి ఇవ్వబడదు. ఈ అయితే ఈక్రమంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇండియా తరపున బిగ్గెస్ట్ లూజర్ గా రికార్డుకెక్కాడు. అయితే 2011లో మెట్టూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పద్మరాజన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఆయనకు 6,273 ఓట్లు వచ్చాయి – చివరికి విజేతకు 75,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి.  టైర్ల దుకాణం నడుపుతూ,  హోమియోపతి వైద్యం అందిస్తు జీవనం కొననసాగిస్తున్న ఈయన  ఈ ఎన్నికల్లో ఏవిధంగా ప్రభావం చూపుతాడో వేచి చూడాల్సిందే.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి