ఎన్నికల కోసం 45 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమయ్యాడు..ఎక్కడంటే
ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికారం దక్కించుకోవడానికి ఎంతోమంది నాయకులు పోటీ పడుతుంటారు. ఎన్నికల్లో గెలవడం కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు, ప్రచారాలు చేస్తుంటారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికారం దక్కించుకోవడానికి ఎంతోమంది నాయకులు పోటీ పడుతుంటారు. ఎన్నికల్లో గెలవడం కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు, ప్రచారాలు చేస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 45 ఏళ్ల వయసులో వివహానికి సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్‌లో ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయితే రాంపూర్ మున్సిపాలిటీకి ఎలాగైన అధ్యక్షుడు కావాలని మమూన్ షా ఖాన్ (45) అనే స్థానిక కాంగ్రెస్ నాయుకుడు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ రాకముందే ఆరునెలల నుంచి ఆ ప్రాంతంలో ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే ఈసారి వచ్చిన నోటిఫికేషన్ ను చూసి మామున్ షా ఖాన్ షాకయ్యారు. ఎందుకంటే ఈసారి ఈ పోస్టుని ఆడవాళ్లకి రిజర్వ్ చేశారు.
కానీ మమూన్ షా ఖాన్ కు 45 ఏళ్ల వయసునప్పటికి పెళ్లి ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే కొరిక అతనికి ఉంది.తన అనుచరులు కూడా ఆయనకు పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీంతో పెళ్లి చేసుకుంటే తన భార్యను బరిలోకి దించొచ్చని మమూన్ భావించారు. 48 గంటల్లోనే అమ్మాయిని గుర్తించారు. ఆమె కూడా అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. ఏప్రిల్ 15 న వీళ్లిద్దరి వివాహం ఖరారైంది. అయితే ఏప్రిల్ 17న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మమూన్ షా ఖాన్ పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..