దెయ్యాలు, ఆత్మలకు సంబంధించి అనేక రకాలైన వార్తలను వింటుంటాం. దెయ్యాలు, ఆత్మలు నిజమైనవని కొందరు నమ్ముతారు. వాటిలో కొన్ని ఆత్మలు చాలా చెడ్డవని, అవి మనుషులకు హాని కలిగిస్తాయని అంటుంటారు. అయితే, కొన్ని ఆత్మలు మంచివి కూడా ఉంటాయంటారు..అలాంటి దెయ్యాలు నివసిస్తాయని చెప్పుకునే ప్రదేశాల గురించి మీరు చాలానే వినుంటారు. కానీ, ఇక్కడ దెయ్యాలకు నిలయంగా పిలువబడే ఒక హోటల్ గురించి ఈ రోజుల్లో చాలా చర్చ జరుగుతోంది. ఈ హోటల్‌లో ఆత్మలు తిరుగుతున్నట్లు తాము చూశామని చెబుతున్నారు అక్కడి ప్రజలు. (Photo:Instagram/thebakerhotelandspa)