Viral Video: అమ్మ బాబోయ్.. పాము అనుకుంటున్నాడా? తాడు అనుకుంటున్నాడా?.. వీడియో చూస్తే హడలిపోవాల్సిందే..!

Viral Video: సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, సరిసృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతుంటాయి.

Viral Video: అమ్మ బాబోయ్.. పాము అనుకుంటున్నాడా? తాడు అనుకుంటున్నాడా?.. వీడియో చూస్తే హడలిపోవాల్సిందే..!
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 03, 2021 | 10:09 PM

Viral Video: సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, సరిసృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే గుండెలదిరిపోవాల్సిందే. ఓ వ్యక్తి 15 అడుగుల కంటే పొడవైన, భారీ కొండచిలువను భుజంపై మోసుకెళ్లిన తీరు నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. సాధారణంగా పాము పేరు వింటేనే గజగజా వణికిపోతాం. అలాంటి ఆ వ్యక్తి అంత భారీ పామును సునాయాసంగా, సరదాగా మోసుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇంతకీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ వీడియోలోని సన్నివేశం హారర్ సినిమాలా కనిపిస్తోంది. ఓ వ్యక్తి 15 అడుగుల కంటే పొడవైన, భారీ కొండచిలువను తన భుజంపై మెట్ల మార్గంలో మోసుకుంటూ వెళ్తున్నాడు. కొండ చిలువ తల భాగాన్ని భుజంపై వేసుకున్న ఆ వ్యక్తి.. మెట్ల మార్గంలో ఇతర ప్రాంతానికి వెళ్లాడు. కాగా, ఆ వ్యక్తి పామును తీసుకెళ్తుండగా.. మరికొందరు వీడియో తీశారు. ఈ వీడియోను royal_pythons పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏం ధైర్యం రా బాబూ అంటూ షాక్‌తో నోరెళ్లబెడుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించగా.. 6 వేల మందికిపైగా లైక్స్ కొట్టారు. ఇక మరికొందరు నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ పెడుతున్నారు.

Viral Video:

Also read:

Diwali 2021: దీపావళి రోజున లక్ష్మీ, గణేషుడి విగ్రహాలు కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..

Crime News: బెలూన్ ఊదుతూ ప్రాణాలు కోల్పోయిన చిన్నారి.. అసలు ఎలా జరిగిందంటే..

Lungs Cancer: పెరుగుతున్న కాలుష్యంతో ముప్పు.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అంతే సంగతులు..