AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీధి కుక్క ఆనందం కోసం షాపు యజమాని చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరలవుతున్న వీడియో..

తాజాగా ఓ వ్యక్తి వీధి కుక్కను సంతోష పెట్టేందుకు చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ కుక్కను కాసేపు ఆడేంచేందుకు అతను చేసిన పని మనసును హత్తుకుంటుంది. ఇంతకీ ఏం చేశాడు అనుకుంటున్నారు.

Viral Video: వీధి కుక్క ఆనందం కోసం షాపు యజమాని చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరలవుతున్న వీడియో..
Vrial Video
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2022 | 9:24 PM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు నెటిజన్స్ హృదయాలను తాకుతున్నాయి. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇందులో పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి వీధి కుక్కను సంతోష పెట్టేందుకు చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ కుక్కను కాసేపు ఆడేంచేందుకు అతను చేసిన పని మనసును హత్తుకుంటుంది. ఇంతకీ ఏం చేశాడు అనుకుంటున్నారు.

కుక్కలు తరచుగా ఇళ్లలో లేదా పార్క్‌లో తమ యజమానులతో ఆడుకుంటూ కనిపిస్తాయి. అలాంటి వీడియోస్ చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. తాజా వీడియోలో ఒక వ్యక్తి ప్లాస్టిక్ గ్లోవ్‌లో నోటితో గాలిని ఆ తర్వాత దానిని బెలూన్ లాగా చేసి దుకాణం బయట నిలబడి ఉన్న కుక్క పిల్ల ముందు పైకి విసిరాడు. ఆ తర్వాత ఆ బెలూన్ కింద పడకుండా ఆ కుక్క పిల్ల అరుస్తూ పైకి విసిరింది. అలా చాలా సమయం వరకు ఆ బెలూన్ తో ఎంతో సరదాగా ఆడుకుంది ఆ కుక్క. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.