Video: ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు.. ఆనంద్‌ మహీంద్రాను సైతం అవాక్కయ్యేలా చేసిన వీడియో..

సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. అయితే సరైన వేదిక లేక ఎంతో మంది ప్రతిభ ప్రపంచానికి తెలియకుండానే మరుగుపడిపోతోంది. కానీ సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో ఉన్న వారి ప్రతిభ సైతం ప్రపంచానికి తెలుస్తోంది...

Video: ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు.. ఆనంద్‌ మహీంద్రాను సైతం అవాక్కయ్యేలా చేసిన వీడియో..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 27, 2022 | 2:43 PM

సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. అయితే సరైన వేదిక లేక ఎంతో మంది ప్రతిభ ప్రపంచానికి తెలియకుండానే మరుగుపడిపోతోంది. కానీ సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో ఉన్న వారి ప్రతిభ సైతం ప్రపంచానికి తెలుస్తోంది. క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియో ఆ కంట ఈ కంట పడి చివరికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రను కూడా చేరింది. ఇంకేముంది వెంటనే వీడియోను ట్వీట్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. నూర్జహాన్‌ అనే యువతి ఒకేసారి 15 మంది స్వాతంత్రోద్యమ నాయకుల ఫొటోలను చిత్రీకరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యంకాని పెయింటింగ్‌ను వేసిన నూర్జహాన్‌ ట్యాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘ఇది అసలు ఎలా సాధ్యమైంది.? ఆ అమ్మాయి ముమ్మాటికీ అత్యంత ప్రతిభవంతురాలు. ఒకేసారి 15 పెయింటిగ్‌ వేయడం అద్భుతం. ఈ ప్రతిభను ఎవరైనా రుజువు చేస్తారా.? ఒకవేళ ఈ ఫీట్‌ నిజంగానే నిజమైతే.. నూర్జహాన్‌కు మా తరఫున స్కాలర్‌షిప్‌ను అందిస్తాము’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోను ఇలా షేర్‌ చేశారో లేదో అలా వైరల్‌ అవుతోంది. క్షణాల్లోనే లక్షల లైక్‌లు, రీట్వీట్‌లతో వీడియో దూసుకుపోతోంది. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నూర్జహాన్‌ది అద్భుత ట్యాలెంట్‌ అంటూ కొందరు ప్రశసంలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం అసలు ఇది ఏలా సాధ్యమైందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే