Viral Video: మాకు దక్కనిది ఇంకెవ్వరికీ చిక్కనివ్వం.. పాపం నోటికి అందకుండా చేసిన మొసళ్లు.. వీడియో
Crocodile Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే వైరల్ అయ్యే
Crocodile Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా మొసళ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. పాపం మొసలి నోటికందిన చేపను.. సాటి మొసళ్లే దక్కకుండా చేశాయంటూ (Social Media) ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీనిలో మొసళ్ల మధ్యకు ఓ చేప వెళ్తుంది.. ఈ క్రమంలో ఓ మొసలి దానిని ఆహారంగా చేసుకోవాలని అనుకుంటుంది. కానీ సాటి మొసళ్లు.. తన ఆశలపై నీళ్లు చల్లుతాయి.
ఈ 14-సెకన్ల వీడియోలో మొసళ్లు నీటిలో నుంచి బయటకు వచ్చి సేదతీరుతుంటాయి. వాటి మధ్యన ఒక చేప కూడా ఉంటుంది. అది భూమిపై గెంతులేస్తూ నీటి గుంతలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అక్కడున్న మూడు మొసళ్లల్లో ఒకటి చూస్తుంది. అయితే చేప మరో మొసలిని మీద దూకుతుంది. ఈ క్రమంలో మొదట చేపను చూసిన మొసలి.. ఇంకోక దాని మీద నుంచి తినేందుకు పరుగు తీస్తుంది. అయితే.. సరిగ్గా ఈ సమయంలోనే మరో రెండు మొసళ్లు కూడా నీటిలోకి వెళ్లేందుకు కదలడంతో ఆ మొసలి కూడా.. నీటిలో పడుతుంది. స్పీడ్ గా అవి పరుగులు తీయడంతో ఇది కూడా వాటితోపాటే నీటిలోకి వెళ్లింది. నోటి దాకా వచ్చింది.. దక్కకుండా పోయిందిగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
No Wally no, you are on a diet! pic.twitter.com/KnotEKPAfe
— Dr. Ajayita (@DoctorAjayita) March 16, 2022
ఈ వైరల్ వీడియోను @DoctorAjayita అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దీనిని చూసి అందరూ నవ్వుకుంటూ తెగ ఇష్టపడుతున్నారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: