AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. తమ్ముళ్ల కోసం అక్క సాహసం.. నెట్టింట వైరల్..

Viral Video Latest: అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ఎలాంటి ఆందోళన చెందకుండా తెలివి, ధైర్యసాహసాలతో సమస్యలను అధిగమిస్తారు...

ఇంట్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. తమ్ముళ్ల కోసం అక్క సాహసం.. నెట్టింట వైరల్..
Fire
Ravi Kiran
|

Updated on: Mar 25, 2021 | 5:26 PM

Share

Viral Video Latest: అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ఎలాంటి ఆందోళన చెందకుండా తెలివి, ధైర్యసాహసాలతో సమస్యలను అధిగమిస్తారు. ఇదిగో ఈ 8 ఏళ్ల చిన్నారి కూడా అలాగే ఆలోచించింది. అకస్మాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగితే.. ఆందోళన చెందకుండా తనతో పాటు ఉన్న ఇద్దరు సోదరులను సమయస్పూర్తితో కాపాడింది. వివరాల్లోకి వెళ్తే..

ఈ సంఘటన అమెరికాలోని చికాగోలో చోటు చేసుకుంది. అక్కడ స్థానిక ఎవెన్యూ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 8 ఏళ్ల బాలిక తన ఇద్దరు సోదరులతో ఇంట్లో చిక్కుకుపోయింది. మంటలు చెలరేగుతున్నా అధైర్యపడకుండా.. సమయస్పూర్తితో ముందుగా ఆ చిన్నారి విండో ఓపెన్ చేసి.. పొడవాటి మ్యాట్రెస్‌ను విసిరింది. దానిపైకి ఆమె దూకింది. ఇక వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి 4 సంవత్సరాల బాలుడు కిటికీ నుంచి దూకగా.. అతడ్ని ఆమె రక్షించింది.

ఆ చిన్నారి తన ఇద్దరు సోదరులను ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా మంటల నుంచి రక్షించింది. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మాత్రం ఆమెకు కొన్ని గాయాలయ్యాయి. ఈ సంఘటనపై అక్కడి జిల్లా ఫైర్ చీఫ్ మాట్లాడుతూ.. ”ఆ చిన్నారి ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నాను. ఆమె ఆలోచనను, తెలివిని ప్రశంసిస్తున్నట్లు” పేర్కొన్నాడు. కాగా, ఈ వార్త అక్కడ స్థానికులకు తెలియడంతో వారందరూ కూడా ఆ చిన్నారి ధైర్యసాహసాలకు మెచ్చుకున్నారు.

Also Read:

కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!