Viral News: 20 మంది గర్ల్‌ ఫ్రెండ్స్‌.. రూ. 10 లక్షలు ఖర్చు.. వీడు మామూలోడు కాదుగా.!

Man Made More Than 20 Girlfriends: ప్రేమకు ఎన్నో అర్ధాలు ఉంటాయంటారు. ఎప్పుడు.? ఎలా.? ఎవరిపై ప్రేమ అనేది పుడుతుందో.! ఎవరూ చెప్పలేరు...

Viral News: 20 మంది గర్ల్‌ ఫ్రెండ్స్‌.. రూ. 10 లక్షలు ఖర్చు.. వీడు మామూలోడు కాదుగా.!
Love
Follow us

|

Updated on: Mar 25, 2021 | 12:55 PM

Man Made More Than 20 Girlfriends: ప్రేమకు ఎన్నో అర్ధాలు ఉంటాయంటారు. ఎప్పుడు.? ఎలా.? ఎవరిపై ప్రేమ అనేది పుడుతుందో.! ఎవరూ చెప్పలేరు. ఈ తరుణంలోనే చాలాకాలంగా కొనసాగుతోన్న ‘డేటింగ్’ అనే సంప్రదాయాన్ని ఈ కాలం యువత అవలంభించింది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ధనికులకే అని చెప్పవచ్చు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.? యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ డేటింగ్ కాన్సెప్ట్ ద్వారా ఏకంగా 20 మందితో ప్రేమాయణం సాగించాడు.. సుమారు ఆరేళ్లలో రూ. 10 లక్షలు ఖర్చు చేశాడు. ‘షుగర్ డాడీ’గా పాపులర్ అయ్యాడు.

అసలు ఈ ‘షుగర్ డాడీ’ అంటే ఎవరూ.? ఏమిటా కథ.? ఆర్ధిక అవసరాల మేరకు యవ్వనంలో ఉన్న ఓ యువకుడు.. ధనిక కుటుంబాల యువతులతో డేటింగ్ చేయడాన్నే ‘షుగర్ డేటింగ్’ అని అంటారు. వారినే ‘షుగర్ డాడీ’, ‘షుగర్ మామీ’గా పిలుస్తారు. చదువుకుంటున్న రోజుల్లో పూర్తిగా విద్యపైనే దృష్టి సారించిన సేథ్.. ఉద్యోగం పొందిన తర్వాత ‘షుగర్ డేటింగ్’ మార్గాన్ని ఎంచుకున్నాడు. ‘షుగర్ డాడీ’గా మారాడు. ఇతగాడు సుమారు ఆరేళ్లలో 10 వేల పౌండ్లు(10 లక్షల రూపాయలు) ఖర్చు పెట్టడంతో 20 మంది గర్ల్‌ ఫ్రెండ్స్‌‌ను పొందగలిగాడు. అతడి లాంగెస్ట్ రిలేషన్‌షిప్ 6 నెలలు అని తెలుస్తోంది. ఒత్తిడిలో ఉన్న ఆ ప్రొఫెషనల్స్‌తో డేటింగ్ చేయడానికి ఇదే సరైన మార్గం అని సేథ్ తెలిపాడు. ఏది ఏమైనా ఇలాంటి కాన్సెప్ట్స్ పుస్తకాల్లో తప్పితే బయట పని చేయవని చెప్పాలి.

Also Read:

కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!