Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఇదెక్కడి ఆచారంరా బాబూ.. ఎక్కడా చూడలేదు.. ఎక్కడా వినలేదు.. కొరడాల పండుగ పేరుతో..

ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ, బక్రీద్ పండుగ.. ఇలా రకరకాల పండుగల గురించి తెలుసు.. కాని కొరడాల పండుగ గురించి మీకు తెలుసా.. ఏంది కొరడాల పండుగ ఏమిటనుకుంటున్నారా.. నిజమే.. కొరడాలతో..

Trending: ఇదెక్కడి ఆచారంరా బాబూ.. ఎక్కడా చూడలేదు.. ఎక్కడా వినలేదు.. కొరడాల పండుగ పేరుతో..
Whips Festival Coimbatore
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 18, 2022 | 9:52 AM

ఉగాది పండుగ, సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ, బక్రీద్ పండుగ.. ఇలా రకరకాల పండుగల గురించి తెలుసు.. కాని కొరడాల పండుగ గురించి మీకు తెలుసా.. ఏంది కొరడాల పండుగ ఏమిటనుకుంటున్నారా.. నిజమే.. కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ.. అమ్మవారి జాతర సందర్భంగా కొరడాల పండగను జరుపుకుంటారు తమిళనాడులోని కొయ్యంబత్తూరులో, తమిళనాడులో కొన్ని పండుగలు భలే వెరైటీగా ఉంటాయి. జల్లికట్టు పండుగకు తమిళనాడు ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. అదే రాష్ట్రంలో చాలామందికి తెలియని మరో ఫేమస్ ఫెస్టివల్‌ కోరడాల పండుగ. వందలాది మంది భక్తులు అమ్మవారిపై అభిమానంతో ఉత్సవం సందర్భంగా కొరడాలతో తమను తాము కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కోయంబత్తూరులోని పూసరిపాళయం ప్రాంతంలో 300 ఏళ్ల నాటి అధికాలమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని దాదాపు పది రోజుల పాటు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించి.. కొరడాలతో కొట్టుకుంటారు. దీనిని కొరడాల పండుగగా కూడా పిలుస్తారు.

ఈ కొరడాల పండుగ ఎన్నో సంవత్సరాల నుంచి సంప్రదాయంగా వస్తుందంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఈ కొరడా దెబ్బలను హరతులుగా భావించడం ద్వారా, కొరడాలతో కొట్టుకుంటూ హరతి ద్వారా అమ్మవారి రుణం తీర్చుకుంటామని భక్తులు విశ్వాసం. కోయంబత్తూర్ టౌన్ హాల్‌కు చాలా సమీపంలో ఉండే అమ్మన్ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద చాలా ఎత్తైన రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయంలో దర్శనంవ చేసుకుంటే తెలియని అనుభూతి పొందుతారనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ అమ్మన్ ఆలయం నది నుండి ఉద్భవించిందని పూర్వీకులు చెబుతారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించే ఉత్సవాలకు భారీగా తరలివస్తారు.

ఎన్నో పండుగల గురించి విని ఉంటాం. కాని కొరడాల పండుగ నిజంగానే తమిళనాడులో చాలా ఫేమస్. కొయ్యంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని కొరడాలతో తమను తాము కొట్టుకోవడం ద్వారా తమకు ఎటువంటి గాయాలు అవ్వవని, దీనికి అమ్మవారి కృప, ఆశీర్వాదాలే కారణమనేది భక్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..