Veterinary Hospital: పశువుల ఆసుపత్రిని ముట్టడించిన మూగ జీవాలు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ఎక్కడైనా సమస్యలు పరిష్కరించాలని మనషులు ఆందోళన చేయడం చూశాం.. కానీ తాజాగా తమ గోడు పట్టించుకోవడంలేదంటూ.. మూగ జీవాలు ఆసుపత్రిని ముట్టడించాయి.
ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలం ముగిసిన మందులు కారణంగా రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆగ్రహం చెందిన గొర్రెల పెంపకం దారులు వినూత్న రీతిలో ఆందోళన బాటపట్టారు. మేకలు, గొర్రెలతో పశువుల ఆసుపత్రి ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. గతకొంతకాలంగా పశువైద్యశాలలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అందుబాటులో లేని మందులు, శిథిలావస్థలో ఆసుపత్రుల భవనాలు ఇలా అనేక సమస్యలు పశువులకు వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. దీంతో వేంసూరు మండలం చౌడారంలో వినూత్న రీతిలో రైతులు నిరసన తెలిపారు. పశువుల ఆసుపత్రి సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని ఆరోపించారు. వెటర్నరీ వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తున్నాయని మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

