Dinosaurs in Jungle: అడవిలో పరుగులు పెడుతున్న డైనోసార్లు.. ఇంకా బతికే ఉన్నాయా..?
కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భారీ జంతువులు భూమిపై నివసించేవి. అవి నేడు కనిపించే ఏనుగుల కంటే ఎన్నో రెట్లు పెద్దవి. అలాంటి భారీ జంతువుల్లో డైనోసార్‌లు ఒకటి. చూడడానికి
కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భారీ జంతువులు భూమిపై నివసించేవి. అవి నేడు కనిపించే ఏనుగుల కంటే ఎన్నో రెట్లు పెద్దవి. అలాంటి భారీ జంతువుల్లో డైనోసార్‌లు ఒకటి. చూడడానికి ఎంతో భయంకరంగా, భారీగా ఉండే ఈ జీవులు ఇప్పుడు అంతరించిపోయాయి. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఒక పెద్ద ఉల్క పడటం వల్ల ఈ రాక్షస జీవులు శాశ్వతంగా అంతరించిపోయాయని ప్రచారంలో ఉంది. అయితే అప్పుడప్పుడు డైనోసార్లు కనిపించాయంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు డైనోసార్లు ఇంకా జీవించే ఉన్నాయా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ఈ వీడియోలో డైనోసార్‌ల మాదిరిగా ఉండే కొన్ని వింత జీవులు అడవిలో పరిగెడుతూ కనిపించాయి. అడవిలో డైనోసార్‌ల మాదిరిగా ఉండే ఈ చిన్న చిన్న జీవులు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ వెళ్తున్నాయి. నిజమైన డైనోసార్‌లతో పోలిస్తే ఎత్తులో ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ, మెడ మాత్రం అచ్చు డైనోసార్లలాగే చాలా పొడవుగా ఉంటుంది. శాకాహార డైనోసార్లకు ఇంత సన్నగా పొడుగ్గా ఉండే మెడలు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..