Pet Dog: ఆ పెంపుడు శునకానికి విపరీతంగా వాంతులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఎక్స్ రే తీయగా..
కొందరికి పెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరికొందరు అవి అంటే ప్రాణం అంటారు. వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తారు. వాటికి చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతున్నారు. అలానే ఓ ఫ్యామిలీ పెంచుకుంటున్న పెట్ డాగ్ అస్వస్థతకు గురైంది. అదే పనిగా వాంతులు చేసుకుంది. అంతేకాదు పొట్ట కూడా ఉబ్బిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా...

మీరు పెట్ డాగ్స్‌ని ఇష్టపడేవారు.. వాటిని పెంచేవారు అయితే మీకు ఓ విషయంపై క్లారిటీ బాగా ఉండి ఉంటుంది. అవి చెప్పులు, షూలు, సాక్సులు, మంచం కోళ్లు వంటిని కొరకుతూ ఉంటాయి. కానీ ఈ బెర్నీస్ మౌంటెన్ కుక్క లూనాకు మాత్రం.. సాక్సులు అంటే విపరీతమైన వ్యామోహం ఉంది. అయితే ఇది వాటిని కేవలం కొరికి వదిలెయ్యదు. ఏకంగా మింగేస్తుంది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. 24 సాక్సులు మింగేసింది. వాటినే కాదు.. హెయిర్ బ్యాండ్, హెయిర్ టైస్, చెప్పు లోపల ఉండే రబ్బరు వంటి పదార్థం, ఇంకా పలు రకాల గుడ్డ ముక్కలను కూడా మింగేసింది. ఈ సంఘటన కాలిఫోర్నియాలో జరిగింది. ఆ తర్వాత ఆ కుక్క అనారోగ్యానికి గురైంది. ఆపై వాంతులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. పొట్ట కూడా ఉబ్బిపోతుంది. దీంతో వెంటనే దాన్ని పెంచుకుంటున్న ఫ్యామిలీ మెంబర్స్.. కరోనా యానిమల్ ఎమర్జెన్సీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత.. దుస్తులు సహా వివిధ రకాల వస్తువులు దాని పొట్ట, పేగుల్లో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.
View this post on Instagram
గ్యాస్ట్రోటమీ, ఎంటరోటమీ ప్రక్రియల ద్వారా లూనా కడుపు లోపల చిక్కుకున్న వస్తువులను అన్నింటిని బయటకు తీశారు. దాదాపు మృత్యువు అంచులవరకు వెళ్లిన ఆ పెట్ డాగ్ ఇప్పుడు కోలుకుంటుంది. లూనా త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆరోగ్యకరంగా జీవించాలని పెట్ లవర్స్ కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…
