Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుపై దూసుకెళ్తున్న రైలు..ఆశ్యర్యంలో స్థానికులు వీడియో!

రోడ్డుపై దూసుకెళ్తున్న రైలు..ఆశ్యర్యంలో స్థానికులు వీడియో!

Samatha J

|

Updated on: Mar 03, 2025 | 2:19 PM

జుగాడ్లను తయారుచేయడంలో భారతీయులను మించినవారుండరనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వాటికి సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట చూస్తుంటాం. తాజాగా మరో జుగాడ్‌ వాహనం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదో వింత రైలు అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో .. రోడ్డు మీద ఓ పొడవాటి గూడ్స్‌ రైలు వెళ్తోంది. ఇదేంటి రైలు పట్టాలమీద కదా వెళ్తుంది రోడ్డుమీద ఎందుకు వెళ్తుందనేగా మీ అనుమానం.

రైలంటే రైలు కాదండి.. అదొక జుగాడ్‌. కొందరు పదుల సంఖ్యలో తోపుడు బళ్లను అన్నింటినీ ఒకదానికొకటి జతచేసి కట్టేశారు. వాటిపైన అవసరమైన సరుకుతో నింపేశారు. దాన్ని చూస్తే అదొక గూడ్స్‌ రైలులా కనిపిస్తోంది. దీన్ని తీసుకెళ్లి ఓ ట్రాక్టర్‌ ఇంజన్‌కు కట్టారు. అలా ట్రాక్టర్‌ ఇంజిన్‌తో ఒకేసారి పెద్దమొత్తంలో సరుకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్‌ నడుపుతుంటే ఈ తోపుడు బళ్లన్నిటినీ లాక్కెళ్తుంది. అది అచ్చం చూడడానికి రైలు రోడ్డు మీద వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వింత వాహనాన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారిపోయింది. ఆ వింత రైలును చూసి నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. ఇప్పటికే ఈ వీడియోను 60 వేలమందికి పైగా వీక్షించారు. చాలామంది లైక్‌ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. దీనిని చూసి ఇండియన్‌ రైల్వే భయపడుతుందని కొందరు, ఈ రైలుకు పట్టాలు అవసరంలేదని కొందరు, భలే.. లో బడ్జెట్‌ గూడ్స్‌ రైలు అని ఇంకొందరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్‌!వీడియో

పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం

మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో

 గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో