YS Sharmila: తెలంగాణలో కొత్త పొత్తుపొడుపులు.. డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ మర్మం అదేనా.. టీ కాంగ్రెస్‌ నేతల మౌనానికి అర్థం ఏంటో..

తెలంగాణలో సరికొత్త పొత్తులు పొడుస్తున్నాయా? కాంగ్రెస్‌తో పొత్తు కోసం YTP ప్రయత్నిస్తోందా? అటునుంచి నరుక్కు వచ్చేందుకు షర్మిల పావులు కదుపుతున్నారా? బెంగళూరు వెళ్లి KPCC అధ్యక్షుడు శివకుమార్‌ను కలవడానికి కారణమేంటి?

YS Sharmila: తెలంగాణలో కొత్త పొత్తుపొడుపులు.. డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ మర్మం అదేనా.. టీ కాంగ్రెస్‌ నేతల మౌనానికి అర్థం ఏంటో..
Sharmila Meet DK Shivakumar
Follow us
Sanjay Kasula

|

Updated on: May 29, 2023 | 8:30 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పొడుపుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతోందా? అది కూడా ఇప్పటిదాకా తమను విమర్శిస్తూ వచ్చిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలతో టీ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోబోతోందా? తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకు వయా కర్నాటక రహదారిగా కానుందా? కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్-వైఎస్సార్టీపీ పొత్తు ఉంటుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు పార్టీల పొత్తుల విషయంలో కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ మధ్యవర్తిత్వం వహిస్తున్నారా? అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఈ మేటర్‌లో ఇప్పటికే హైకమాండ్ ఎంటరైందంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

ఎన్నికలకు ఆరు నెలల కంటే తక్కువే సమయం ఉండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పాదయాత్రతో ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే కాంగ్రెస్‌ వైపు ఆమె దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో కాకుండా అటునుంచి నరుక్కొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా ఆమె బెంగళూరు వెళ్లి KPCC అధ్యక్షుడు, కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌తో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్‌తో షర్మిల సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. దాదాపు అరగంట పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు సమాచారం. షర్మిల కలిసిన ఫొటోలు, వీడియోలను శివకుమార్‌ కార్యాలయం విడుదల చేసింది.

కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ కలవడం కేవలం మర్యాదపూర్వక భేటీ అని YTP వర్గాలు చెప్తున్నాయి. DK శివకుమార్‌తో గతంలో ఉన్న స్నేహం కారణంగా షర్మిలను ఆమె కలిశారనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ అంతకుమించి రాజకీయ కోణం ఉందంటున్నారు. 40 నియోజకవర్గాల్లో బలం ఉందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ఆసక్తిగా మారాయి. YTP, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కోసం DK మధ్యవర్తిత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈ మొత్తం వ్యవహారం తమ హైకమాండ్‌ దృష్టిలో ఉందని టీపీసీసీ నేతలు చెప్తున్నారు.

ఇదేం లేకపోతే ఇవాళ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కర్నాటక వెళ్లి అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఎందుకని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీ అంటున్నారు. అభినందించడానికి వెళ్లారు అంటున్నారు. అలా అయితే ఫోన్‌ చేసి కూడా విషెస్‌ చెప్పొచ్చు కదా అనే డౌట్‌ కూడా వస్తోంది. దాదాపు అరగంట పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు సమాచారం. తెలంగాణ తాజా రాజకీయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో అతి పెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌ మనం వినబోతున్నామా?

అయితే టీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వర్గానికి మాత్రం షర్మిలతో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. షర్మిల ఏపీ నేత కాబట్టి అక్కడకు వెళ్లి రాజకీయాలు చేసుకోవాలంటున్నారు రేవంత్‌. ఇదే విషయమై రేవంత్‌, షర్మిల మధ్య గతంలో మాటల యుద్ధం కూడా నడిచింది. తనకు 43 అసెంబ్లీ సీట్లలో బలం ఉందని, ఢిల్లీ నుంచి మిస్డ్‌ కాల్స్‌ కూడా వస్తున్నాయని షర్మిల చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!