Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత అన్నను చంపిన తమ్ముడు…పోలీస్‌ విచారణలో షాకింగ్‌ నిజాలు..

క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.. వావి వరసలు మరచిపోయి, జంతువుల కన్న హీనంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది జనాలు.. కుటుంబంలో ఏదైనా గొడవలు వస్తే కూర్చొని మాట్లాడు కోవాల్సిన వారు..ఒకరి పై ఒకరు దాడులు చేసుకొవడంతో పాటు.. హత్యలు చేసుకోవడానికి సైతం వెనుకాడడం లేదు.. ఇలాంటి ఘటనే ఇటీవలి కాలంలో మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.  మద్యం మత్తులో ఉన్న అన్నకు కరెంట్ షాక్ పెట్టి చంపేసాడు తమ్ముడు.. అత్యంత దారుణంగా

సొంత అన్నను చంపిన తమ్ముడు...పోలీస్‌ విచారణలో షాకింగ్‌ నిజాలు..
Crime News
Follow us
P Shivteja

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 18, 2025 | 1:42 PM

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నానూ తాండాలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండడంతో అన్నకు తమ్ముడు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని పోలీసులు భావించారు. శంకర్ మృతిపై అనుమానాలు ఉండడంతో తమ్ముడు గోపిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పోలీసులే షాక్ తినే వాస్తవాలు బయటపడ్డాయి.

నాను తండాలో నివాసం ఉండే చందర్ అనే వ్యక్తికి శంకర్,గోపి అనే ఇద్దరు కుమారులు..కాగా వీరిద్దరు గత కొంతకాలంగా గొడవపడే వారు..గతంలో చందర్ చిన్న కుమారుడైన గోపి ద్విచక్ర వాహనాల చోరీ విషయంలో చర్లపల్లి జైలుకు సైతం వెళ్లి వచ్చాడు..పెద్ద కుమారుడు శంకర్ కి గతంలో పెళ్లి కాగా ఒక కుమారుడు సైతం ఉన్నాడు..కాగా తరచూ భార్యతో గొడవపడే శంకర్ మొదటి భార్యను వదిలిపెట్టి, ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నాడు..కాగా రెండో భార్య తమ్ముడు గోపితో చనువుగా ఉండడంతో తరచూ అన్నదమ్ముల మధ్య గొడవ జరిగేదని స్థానికులు అంటున్నారు..

కాగా అన్న శంకర్ గత కొద్దిరోజులుగా మద్యానికి బానిస అయి,ప్రతి రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడు అని,నిన్న కూడా మద్యం సేవించిన ఇద్దరు అన్నదమ్ములు కొద్దిసేపు వాగ్వాదానికి దిగడంతో ఇరుగుపొరుగు వారు నచ్చ చెప్పారు..అయితే ఆ గొడవను మనసులో పెట్టుకున్న తమ్ముడు గోపి..అర్థరాత్రి నిద్రిస్తున్న అన్న శంకర్ కి, ఇంట్లో కరెంటు బోర్డు నుండి కరెంటు వైర్ తీసి,దానితో అన్న శంకర్ కాలుకు ఒకవైరుని, మరో వైర్ ను చేతుకు చుట్టి షాక్ పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు..శంకర్ అరుపులు విని గమనించిన తండ్రి చందర్,గట్టిగా అరుపులు వేయడంతో తండావాసులు వచ్చి చూడగా, శంకర్ అప్పటికే కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు గుర్తించారు..దీనితో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు గోపి కోసం గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..