షోరూమ్ నుంచి కొత్త స్కూటీతో టెస్ట్ డ్రైవింగ్‌కి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఒక వ్యక్తి స్కూటీని ప్రయత్నించే నెపంతో కొత్తబండితో ఊడాయించాడు. సదరు వ్యక్తిపై షోరూమ్ నిర్వాహకులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి తన పాత స్కూటర్ పార్క్ చేసి కొంత డబ్బు డిపాజిట్ చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ షాకింగ్ దొంగతనం సంఘటన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి పట్టపగలు కొత్త స్కూటర్‌తో పరారయ్యాడు. షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ వ్యక్తికి హ్యాపీగా స్కూటర్ తాళాలు ఇచ్చిన యజమాని, ఉద్యోగులు అందరిముందే స్కూటర్ తీసుకుని పారిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం స్కూటీ ఏజెన్సీకి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డైంది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన న్యూ మండి కొత్వాలి ప్రాంతానికి చెందినది. పచ్చెండ రోడ్డులో ఉన్న షోరూం నుంచి టెస్ట్ డ్రైవ్ చేస్తానంటూ ఓ యువకుడు కొత్త స్కూటర్‌తో పరారయ్యాడు. చుట్టూపక్కలంతా వెతికినా నిందితుడి ఆచూకీ లభించలేదు. స్కూటర్ కొనేందుకు షోరూంకి వచ్చిన సదరు వ్యక్తి వారిని సంప్రదించాడు. స్కూటర్ ట్రయల్ పేరుతో కొత్త స్కూటీ తాళాలు తీసుకుని బయల్దేరాడు. అలా వెళ్లిన వ్యకర్తి తిరిగి రాలేదు. ఏజెన్సీ సిబ్బంది అతని కోసం కొంతసేపు వేచి ఉండి చూడసాగారు. కానీ, అతని అతను ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో..వెతకడానికి బయలుదేరారు. కానీ, అతను ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించాడు. షోరూమ్ యజమాని నాయి మండి కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి స్కూటర్ కొనేందుకు వచ్చానని చెప్పారు. ఇక్కడ తన పాత స్కూటర్ పార్క్ చేసి కొంత డబ్బు డిపాజిట్ చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
मुजफ्फरनगर ऐसे चोरो से हो जाइये सावधान,इलेक्ट्रिक स्कूटी खरीदने आया युवक टेस्ट ड्राइव करते हुआ रफुचककर,CCTV मे कैद अब पुलिस कर रही तलाश,विश्वास दिलाने के लिए पुराने स्कूटर शोरूम पर किया खड़ा और कुछ रूपये भी किये जमा।@Uppolice @muzafarnagarpol pic.twitter.com/OFEdxBORdk
— Naseem Ahmad Journalist NDTV (@NaseemNdtv) January 17, 2025
ఏజెన్సీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ దొంగతనం సంఘటన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వ్యక్తి స్కూటర్ గురించి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..