భర్తతో కాపురం చేయాలంటే రూ. కోటి డిమాండ్ చేసిన భార్య… కారణం ఏంటో తెలిస్తే అవాక్కే..
పెళ్లి కోసం వరుడి వైపు నుండి కట్నం డిమాండ్ చేయడం గురించి ఇప్పటి వరకు మీరు చాలా వార్తలు వినే ఉంటారు. అయితే, కట్న కానుకలకు సంబంధించి ఇక్కడ ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లో ఓ భార్య తన భర్త ముందు ఓ వింత షరతు పెట్టింది. తాను తన భర్తతో కలిసి జీవించాలంటే.. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.. దీని వెనుక కారణం మరింత షాకింగ్‌గా ఉంది. దీంతో కంగుతిన్న ఆమె భర్త.. వెంటనే పోలీసులను ఆశ్రయించి న్యాయం కోసం వేడుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం రాగానే భార్య మారిపోయింది. తనతో కలిసి జీవించాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని భర్తకు షరతు విధించింది. దీంతో భర్త సహనం కోల్పోయాడు. ఈ విషయమై కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి భర్త కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. బాధిత వ్యక్తి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత ఆమె తన తండ్రి వద్దకు వెళ్లిపోయిందని భర్త చెప్పాడు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ పరిస్థితి మారిపోయింది. ఆమె తనతో కలిసి జీవించడానికి వస్తే ముందుగా కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేసినట్టుగా పోలీసులకు వివరించాడు.
కాన్పూర్‌లోని ఒక పాఠశాల డైరెక్టర్ బజరంగ్ భదౌరియా తన భార్య లక్షిత సింగ్, ఆమె కుటుంబ సభ్యులపై నౌబస్తా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం, అతనికి 2020లో ఢిల్లీ నివాసి లక్షిత సింగ్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఇద్దరూ కాన్పూర్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యకు ఢిల్లీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది. భార్య తన వద్దకు రావాలంటే..డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, బావమరిది, అన్నదమ్ములిద్దరూ కూడా తనను బెదిరిస్తున్నారని బాధితురాలి భర్త చెబుతున్నాడు. రూ.1.5 కోట్లు ఇచ్చేంత వరకు తన కూతురిని అత్తమామల ఇంటికి పంపనని స్పష్టంగా చెబుతున్నాడు. తనపై ఒత్తిడి తెస్తే తనను, తన కుటుంబాన్ని వరకట్నం కేసులో ఇరికిస్తానని భార్య కూడా బెదిరిస్తోందని భర్త చెబుతున్నాడు.
ఈ కేసులో బాధితురాలి భర్త తన భార్య, బావ, బావపై నౌబస్తా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన మామ, బావ కూడా తనపై దాడి చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. భర్త తరపున రిపోర్టు ఇచ్చామని పోలీసు అధికారి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..