AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘నిన్ను, నీ పిల్లలను చంపేస్తుంది’.. భర్తకు భార్య ప్రియుడి వేధింపులు.. తట్టుకోలేక ఏం చేశాడంటే

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే బెదిరింపులు, దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వివాహేతర సంబంధాల...

Telangana: 'నిన్ను, నీ పిల్లలను చంపేస్తుంది'.. భర్తకు భార్య ప్రియుడి వేధింపులు.. తట్టుకోలేక ఏం చేశాడంటే
crime news
Ganesh Mudavath
|

Updated on: Sep 04, 2022 | 11:41 AM

Share

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే బెదిరింపులు, దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వివాహేతర సంబంధాల గురించి. వీటి కారణంగా నిండు జీవితాలు నిలువునా కూలుతున్నాయి. పచ్చని కుటుంబంలో చిచ్చు రేపి రోడ్డున పడేస్తోంది. తాజాగా ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన జంపయ్య, తన భార్య నాగేంద్రతో కలిసి నివాముంటున్నారు. ఆమెకు అదే గ్రామంలో ఉంటున్న మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా వీరి మధ్య రెండేళ్లుగా సన్నిహిత సంబంధం ఉంది. విషయం తెలుసుకున్న జంపయ్య పద్ధతి మార్చుకోవాలని భార్యకు, యువకుడికి సూచించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో గొడవలు జరుగుతుండేవి. వీరి వ్యవహారాన్ని గ్రామ పెద్దలకు చెప్పాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. బాధితుడి ఆవేదనను అర్థం చేసుకున్న పెద్దలు యువకుడికి జరిమానా విధించారు. ఇంకెప్పుడూ వారి ఇంటికి వెళ్లవద్దని, ఆమెతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించారు.

అయినా.. ఇదే విషయంపై మరోసారి జంపయ్య, నాగేంద్రకు గొడవ జరిగింది. దీంతో నాగేంద్ర పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఇంట్లో లేడనే విషయం తెలుసుకున్న యువకుడు జంపయ్యను బయటకు వెళ్దామని తీసుకెళ్లాడు. నాగేంద్ర గురించి లేని పోని కట్టుకథలు చెప్పాడు. ఆమె నిన్ను, నీ పిల్లల్ని చంపేస్తుందని భయపెట్టాడు. దీంతో జంపయ్య తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. భార్య తీరుతో విసిగిపోయానని, ఇక జీవించలేనంటూ తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళనకు గురైన ఎల్లయ్య గ్రామంలో తెలిసిన వారికి ఫోన్‌ చేసి చెప్పారు. వారు అక్కడి వెళ్లి చూసే సరికే అప్పటికే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

కాగా.. జంపయ్య మృతికి యువకుడే కారణమంటూ అతని ఇంటి ఎదుట బాధిత కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చచెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జంపయ్య తండ్రి ఫిర్యాదుతో ఆతని భార్యపై, యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం…