Lok Sabha Elections: పోలింగ్ స్టేషన్లో అరుదైన ఘటన.. ఓటు కోల్పోయిన వ్యక్తి ఏం చేశాడంటే..

| Edited By: Srikar T

May 14, 2024 | 10:47 AM

నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం భైంసా పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్కార్ సినిమాను తలపించేలా ఒకరికి బదులుగా మరొకరు ఓటును వేయడంతో ఓటు హక్కును ఛాలెంజ్ చేసి తమ ఓటు హక్కును కాపాడుకున్నారు ఓ ముగ్గురు ఓటర్లు. బైంసా పట్టణంలోని ఆఫ్రిన్ బేగం(ఓటరు క్రమసంఖ్య1258), షేక్ అహ్మద్(ఓటరు క్రమసంఖ్య 653) అనే ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారు.

Lok Sabha Elections: పోలింగ్ స్టేషన్లో అరుదైన ఘటన.. ఓటు కోల్పోయిన వ్యక్తి ఏం చేశాడంటే..
Tender Voting
Follow us on

నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం భైంసా పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్కార్ సినిమాను తలపించేలా ఒకరికి బదులుగా మరొకరు ఓటును వేయడంతో ఓటు హక్కును ఛాలెంజ్ చేసి తమ ఓటు హక్కును కాపాడుకున్నారు ఓ ముగ్గురు ఓటర్లు. బైంసా పట్టణంలోని ఆఫ్రిన్ బేగం(ఓటరు క్రమసంఖ్య1258), షేక్ అహ్మద్(ఓటరు క్రమసంఖ్య 653) అనే ఇద్దరు శ్రీ సరస్వతి శిశుమందిర్ కిసాన్ గల్లి ఉన్నత పాఠశాలలో బూత్ నంబర్ 151లో తన ఓటును వినియోగించుకునేందుకు వెళ్లగా.. అప్పటికే వారి ఓటు వేసి ఉండటంతో షాక్ అయ్యారు. ఎవరో తమకు బదులుగా ఓటు వేసి.. సంతకం కూడా చేసి వెళ్లడంతో ఆ ఇద్దరు ఓటర్లు నిరాశకు గురైయ్యారు. తమకు బదులుగా మరొకరు ఓటు వేశారని.. అలా ఎలా వేశారంటూ ఎలక్షన్ అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న పి.ఓ అధికారి ఆ ఇద్దరికి టెండర్ఢ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు.

దీంతో ఓటును సవాల్ చేసి.. టెండర్ ఓటును వినియోగించుకున్నారు ఈ ఇద్దరు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించారు ఆ ఇద్దరు ఓటర్లు. అయితే ఇలా టెండర్ ఓటు వినియోగించుకున్న వారికి ఈవీఎం ద్వారా కాకుండా‌.. బ్యాలెట్ ద్వారా.. ఫారం 17 (బి) లో పేరు వివరాలు నింపి సంతకం చేసి, 49(పి)ప్రకారం అన్ని గుర్తులు కల్గిన ప్రత్యేక టెండర్ఢ్ బ్యాలెట్ పేపర్ ను ఇవ్వగా, అభ్యర్థులు తమ ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సాధారణంగా ఇలా 49(పి) సెక్షన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారు అత్యల్పమని.. దేశ వ్యాప్తంగా ఇలా ఓటు వేసిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించేంత మాత్రనే ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే చాలామంది ఓట్లు గల్లంతైనా, దొంగ ఓట్లు వేసినా.. నిజమైన ఓటర్లకు 49(పి) గురించి ఎక్కువగా తెలియకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అని తెలిపారు.

అసలు టెండర్ ఓటు అంటే ఏంటి.. ఎలా వేయాలి.?

ఎన్నికల్లో‌.. ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతవడం.. మరికొందరు ఒకరికి బదులుగా మరొకరు దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటాయి. అలాంటి వారు తమ ఓటు హక్కును సవాల్ చేసి ఓటు హక్కు వినియోగించుకోవడమే టెండర్ ఓటు అంటే. బైంసాలో కూడా అదే జరిగింది. ఇక్కడ ఓటు హక్కు ఉన్న ఓటర్‎కు బదులుగా మరొకరు దొంగ ఓటు వేయడంతో సవాల్ చేసి టెండర్ ఓటు వేశారు ఓటర్. దొంగ ఓటును సవాల్ చేసేందుకు పరిష్కారమే సెక్షన్‌ 49(పి). కేంద్ర ఎన్నికల సంఘం.. 1961లో సెక్షన్‌ 49(పి) ను అమల్లోకి తీసుకువచ్చింది. పోలింగ్‌ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే.. సెక్షన్‌ 49(పి) ద్వారా మీరు మళ్లీ ఓటు వేయొచ్చు. అదెలా అంటే.. మీ ఓటు వేరేవాళ్లు వేశారని తెలిసిన వెంటనే ముందు ప్రిసైడింగ్‌ అధికారిని కలవాలి. మీ ఓటు ఇతరులు వినియోగించుకున్నారని.. ప్రిసైడింగ్ అధికారి ముందు నిరూపించుకోవాలి. దాని కోసం ఓటరు గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం అనుమతిచ్చిన ఐడీ కార్డులను చూపించాలి.

ఇవి కూడా చదవండి

ఇక ఎన్ఆర్ఐలు అయితే పాస్‌పోర్టు సమర్పించవచ్చు. అది నిజం అని ప్రిసైడింగ్‌ అధికారి నిర్ధారిస్తే.. ఫామ్‌ 17(బి)లో పేరు, సంతకం చేసి తిరిగివ్వాలి. అనంతరం టెండర్‌ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రిసైడింగ్‌ అధికారి ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇస్తారు. బ్యాలెట్‌ పేపర్‌పై మీరు వేయాలని భావించే అభ్యర్థికి ఓటు వేసి.. ఆ బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలి. దాన్ని ప్రిసైడింగ్ అధికారి.. ప్రత్యేక కవర్‌లో దాచి.. కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు. దీంతో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అవుతుంది. అయితే ఇలా వినియోగించుకున్న ఓటు అత్యవసరం అయితే తప్ప కౌంటింగ్ చేయరు.. ఓట్ల లెక్కింపు సమయంలో గెలుపొందిన అభ్యర్థి మెజార్టీ రన్నరప్ కంటే అత్యల్పంగా ఉన్నప్పుడు వీటిని పరిగణనలోకి తీసుకుంటారు. మెజార్టీ ఎక్కువగా ఉంటే టెండర్ ఓటర్లను లెక్కించరు. నిజానికి ఎన్నికల్లో ఈ ఓటును వినియోగించుకున్న వాళ్లు చాలా అరుదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..