Telangana: ధాన్యం బస్తాలో కరెన్సీ కట్టలు.. తెలియక అమ్మేసిన భార్య.. ఆ తర్వాత..
ఎడ్లు అమ్మగా వచ్చిన నగదును ఆ ఇంటి మనిషి ధాన్యం బస్తాలో దాచాడు. ఈ విషయం ఆ ఇంటావిడకు తెలీదు. ఓ చిరు వ్యాపారి రావడంతో ఆ ధాన్యం బస్తాను అమ్మేసింది. కొంతసేపటికి విషయం తెలియడంతో దంపతులు హైరానా పడ్డాడు. ఊరంతా వెతికినా ఆ వ్యాపారి కనిపించలేదు. దీంతో...

మీవి పేద, మధ్య తరగతి కుటుంబాలు అయి ఉండి.. గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తూ ఉంటుంటే మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. మన ఇళ్లలో నగదును వంటి గదిలోని పాత్రల్లో, బెడ్ కింద, బియ్యం బస్తాల్లో దాయడం కామన్. బీరువా లాకర్ ఉన్నా కూడా కొందరు ఇలానే చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలా చేస్తుంటే కొన్నిసార్లు ఆ నగదును పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.
పోతరాజు వీరయ్య అనే రైతు గణపురం మండలం గాంధీనగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని ఇటీవల తన ఎడ్లను మరొకరికి విక్రయించగా లక్షా 50 వేల నగదు వచ్చింది. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లోని ఓ ధాన్యం బస్తాలో దాచాడు. ఈ విషయం వీరయ్య సతీమణికి తెలీదు. బుధవారం రోజున.. కొద్ది మొత్తంలో ఊరురా తిరిగి ధాన్యం కొనుగోలు చేసే చిరు వ్యాపారి వారి గ్రామానికి వచ్చాడు. అతనికి వీరయ్య భార్య నగదు దాచిన దాన్యం బస్తాను విక్రయించింది. కాసేపటి తర్వాత పొలం నుంచి వచ్చిన వీరయ్యకు దాన్యం బస్తా కనిపించలేదు. దీంతో ఆయన కంగారుగా వెళ్లి భార్యను అడగ్గా.. ఆ ధాన్యం బస్తాను అమ్మేసిన విషయం చెప్పింది. అయ్యో ఎంత పని చేశావంటూ.. వెంటనే వెళ్లి గ్రామంలో వెతగ్గా ఆ వ్యాపారి జాడ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
