AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలూ బీ అలర్ట్.. బంగారం ఆభరణాలు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారా?

బస్టాండ్లలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం వేసుకుని ప్రయాణించేటప్పుడు ఇంకొంచం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మీ పక్కన ఉండే వాళ్ళు? మంచి వాళ్ళ లేక దొంగ అని మీకు అర్ధంకాకపోవచ్చు. ఆ దొంగలు కూడా మనుషుల్లాగే ఉంటారు. కాబట్టి, మీ చుట్టుపక్కల అన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

మహిళలూ బీ అలర్ట్.. బంగారం ఆభరణాలు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నారా?
Gold
Prasanna Yadla
|

Updated on: Jan 27, 2026 | 7:06 PM

Share

రోడ్డు మీద బంగారం వేసుకుని నడవాలన్నా కూడా భయపడే రోజులు వచ్చాయి. ఎందుకంటే, ఎటు నుంచి దొంగలు వచ్చి బంగారు లాక్కొని వెళ్తారా? అనే భయమే ఎక్కువగా ఉంటుంది. ఓ వైపు బంగారు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకో వైపు దొంగతనాలు కూడా అలానే పెరుగుతున్నాయి.కొందరు కేటుగాళ్లకి ఇదే పని ఎవరు బంగారం వేసుకుంటే.. వారి నుంచి ఎలా అయినా బంగారాన్ని కొట్టేయాలని. అందరూ వారి పనుల మీద దృష్టి పెడుతుంటే దొంగలు మాత్రం ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా? అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. రద్దీ ప్రదేశాలే వారి అడ్డా.

గత కొద్దీ రోజుల నుంచి కొన్ని చోట్ల ఈ చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దొంగల చూపంతా ఆడవాళ్ళ బంగారం పైనే. మనుషులు పని చేసుకుని వచ్చిన డబ్బుతో వారి కుటుంబాన్ని పోషిస్తారు. కానీ, దొంగలు మాత్రం రోజులో ఒక చిన్నబంగారం ముక్క దొంగిలించినా వారికీ రూ.లక్షల్లో డబ్బులు వస్తాయి. వీటి కోసం రోజంతా రోడ్ల మీద తిప్పలు పడుతూనే ఉంటారు.

సాధారణంగా ఇలాంటివి ఆడవాళ్ళు ఎక్కిన బస్సులు , రైళ్లలో బాగా జరుగుతుంటాయి. ఈ కేటు వాళ్ళు కూడా ఒక టికెట్ బుక్ చేసుకుని వీళ్ళు ఎక్కిన బస్సులోనే ఉంటారు. ఎవరిని అయితే, టార్గెట్ చేస్తారో వారి ప్రతి కదలికలను గమనిస్తూనే ఉంటారు. ఇక టైం చూసి బ్యాగ్ లేదా ఏకంగా మెడలో నుంచో బంగారాన్ని కొట్టేస్తారు. ఆ తర్వాత బంగారాన్ని పోగొట్టుకున్న వారు వామ్మో.. మా బంగారం పోయిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇస్తుంటారు. గత కొన్ని నెలల నుంచి బంగారం ధర అతి భారీగా పెరగడంతో ఇదే చోరీలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ చూసి ప్రయాణికుల్లో కూడా కొత్త భయం మొదలైంది. కాబట్టి, మీరు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. లేదంటే మీ బంగారం పోయే.. మీ సొమ్ములు పోయే.

మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

1. మహిళలు రైళ్లు, బస్సులో ప్రయాణించేటప్పుడు కిటికీ సీట్లో పొరపాటున కూడా కూర్చోకండి. 2. ఒకవేళ మీకు ఇష్టమైయ్యి కిటికీ పక్కన కూర్చున్నాఆడవాళ్లు వారి మెడలోని బంగారు, బ్యాగ్ లో ఉండే ఆభరణాలను ఒక బాక్స్ లో కానీ, అనుమానం రాకుండా చీరతో కానీ కప్పి ఉంచండి. 3. జనాభా ఎక్కువగా ఉండే సమయంలోనే ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. బస్సు ఎక్కుతూ, దిగుతూ ఉన్న సమయంలో మీ జాగ్రత్తలో మీరు ఉండండి. 4. మహిళలు బంగారం వేసుకోకపోవడమే మంచిది వాటికీ బదులు రోల్డ్ గోల్డ్ వేసుకోవడం మంచిది. దీని వలన మీరు వాళ్ళని బురిడీ కొట్టించినట్లు ఉంటుంది.

పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదు
పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదు
వామ్మో.. జర్రుంటే ఏం జరిగేదో.. రోడ్డుపై వెళ్తున్న బాలుడు.. అంతలో
వామ్మో.. జర్రుంటే ఏం జరిగేదో.. రోడ్డుపై వెళ్తున్న బాలుడు.. అంతలో
సక్సెస్‌ కోసం సవాలక్ష తిప్పలు.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చ
సక్సెస్‌ కోసం సవాలక్ష తిప్పలు.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే చర్చ
11 ఫోర్లు, 9 సిక్సర్లు.. 57 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
11 ఫోర్లు, 9 సిక్సర్లు.. 57 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
బాలీవుడ్‌ సక్సెస్‌.. టాలీవుడ్‌ మేల్కోవాల్సిన టైమ్‌ వచ్చేసింది
బాలీవుడ్‌ సక్సెస్‌.. టాలీవుడ్‌ మేల్కోవాల్సిన టైమ్‌ వచ్చేసింది
2, 3 పెగ్గులు వేస్తున్నారా..? లివరే కాదు.. పేగులూ దెబ్బతింటాయ్
2, 3 పెగ్గులు వేస్తున్నారా..? లివరే కాదు.. పేగులూ దెబ్బతింటాయ్
బంగారం ఆభరణాలు వేసుకుని మహిళలు ప్రయాణాలు చేస్తున్నారా?
బంగారం ఆభరణాలు వేసుకుని మహిళలు ప్రయాణాలు చేస్తున్నారా?
ఒకప్పుడు బిస్కెట్స్‌తో కడుపు నింపుకొన్నాడు.. ఇప్పుడు స్టార్ హీరో
ఒకప్పుడు బిస్కెట్స్‌తో కడుపు నింపుకొన్నాడు.. ఇప్పుడు స్టార్ హీరో
వేడివేడి అన్నం, రసంలోకి ఈ కేరళ చికెన్ ఫ్రై ఉంటే స్వర్గమే!
వేడివేడి అన్నం, రసంలోకి ఈ కేరళ చికెన్ ఫ్రై ఉంటే స్వర్గమే!
కష్టాలను తరిమికొట్టే చాణక్య మంత్రం.. ఇవి ఫాలో అయితే మిమ్మల్ని..
కష్టాలను తరిమికొట్టే చాణక్య మంత్రం.. ఇవి ఫాలో అయితే మిమ్మల్ని..