బంగారం, వెండిని పింక్ పేపర్‌లోనే ఎందుకు చుట్టి ఇస్తారో తెలుసా?
Samatha
27 January 2026
కొన్ని సార్లు కొన్ని విషయాలను మనల్ని ఎక్కువగా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎందుకంటే. మనకు తెలియకుండానే అవి మనలో ప్రశ్నలను సృష్టిస్తాయి. అందులో ఒకటి బంగారం లేదా వెండి చుట్టే కవర్.
ఇంట్రస్టింగ్
బంగారం లేదా వెండి కొనుగోలు చేసే క్రమంలో దుకాణం దారుడు దానిని పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం చూస్తుంటాం. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
పింక్ పేపర్
అసలు బంగారం, వెండి వంటి వాటిని పింక్ కలర్ పేపర్‌లో ఎందుకు చుడుతారు. దీనికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బంగారం, వెండి
అయితే బంగారు వెండి ఆభరణాలను పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడానికి ఒక కారణం ఉన్నదంట, అది కళ్లను ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఆభరణాలకు సహజ మెరుపునిస్తుంది.
సహజ మెరుపు
ముఖ్యంగా గులాబీ రంగు అనేది ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. అలాగే ఆభరణాలకు కొత్తదనం, స్వచ్ఛతను ఇస్తుంది. అందుకే చాలా బంగారం , వెండి ఆభరణాలను పింక్ పేపర్‌లో చుట్టుతారు.
కొత్తదనం
అంతే కాకుండా, బంగారం వెండి చుట్టే ఈ గులాబీ రంగు పేపర్ యాంటీ, టార్నిష్ పూతను కలిగి ఉంటుందంట. అందువలన ఇది తేమ, చెమట వంటి ప్రభావాలను తగ్గిస్తుంది.
తేమ, చెమట
అందుకే బంగారం ఆభరణాలను పింక్ పేపర్‌లో చుట్టుతారంట. అంతే కాకుండా, గులాబీ ఎరుపు రంగులు లక్ష్మీదేవికి ఇష్టమైన రంగులు. అలాగే ఇవి శుభాన్నిచ్చే రంగులు.
శభసూచకం
పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, అలాగే గులాబీ రంగు అనేది సంపద, శ్రేయస్సును పెంచుతుందని అందులో చుట్టి ఇస్తారంట.