నయన్‌కి హిట్ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి
శ్రీదేవి తనయ జాన్వీ, త్రిష, కియారా, మృణాల్, అలియా వంటి అగ్ర హీరోయిన్లు తమ రాబోయే చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పెద్ది, విశ్వంభర, టాక్సిక్, డెకాయిట్, ఆల్ఫా వంటి సినిమాలు వారి కెరీర్‌కు కీలకం కానున్నాయి. విజయంతో దూసుకుపోవాలని వీరు ఎదురుచూస్తున్నారు, గత వైఫల్యాలను మరచి ఈ సినిమాలతో పుంజుకోవాలని చూస్తున్నారు.
2026 లో మీరు దేని కోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగితే.. ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని షేర్ చేసుకుంటారేమో. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం పెక్యులియర్‌గా ఒకే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ వారు చెబుతున్న వివరాలేంటి? వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి.. అప్పుడెప్పుడో దేవర సినిమా చేసిన తర్వాత సరైన సక్సెస్ లేదు శ్రీదేవి తనయ జాన్వీ ఖాతాలో. అందుకే ఈ ఏడాది రిలీజ్‌కి రెడీ అవుతున్న పెద్ది మీద బిగ్ హోప్స్ పెట్టకున్నారు ఈ లేడీ. ఈ సమ్మర్ కోసం జాన్వీ మాత్రమే కాదు, త్రిష కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్‌తో స్టాలిన్ తర్వాత ఆమె నటించిన విశ్వంభర ఈ సమ్మర్ రేసులోనే ఉంది మరి. లాస్ట్ ఇయర్ రామ్‌చరణ్ తో తెలుగువారిని పలకరించారు కియారా. ఆమె సినీ కెరీర్‌కి గేమ్ ఛేంజర్ పెద్దగా ప్లస్ కాలేదు. అందుకే ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న టాక్సిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకున్న కియారాకి టాక్సిక్ చాలా కీలకమైన మూవీ. మన దగ్గర మృణాల్ కూడా ఈ ఏడాది మీద మరిన్ని ఆశలు పెంచుకున్నారు. అడివి శేష్ తో కలిసి ఆమె నటించిన డెకాయిట్ త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ చూడాలన్నది మృణాల్ కోరిక. ఇటీవలి కాలంలో పెళ్లి వార్తలతో వైరల్ అవుతున్న మృణాల్.,. ఎవరరేమనుకుంటే నాకేంటి? నా దృష్టి మొత్తం డెకాయిట్ మీదే ఉందంటున్నారు. మన వాళ్లే కాదు.. నార్త్ బ్యూటీ ఆలియా కూడా ఈ ఏడాది మీద గట్టిగానే నమ్మకం పెంచుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న విజయం ఈ ఏడాది ఆల్ఫాతో అందుతుందన్నది ఆలియా ఆశ. ప్యాన్ ఇండియా రేంజ్‌లో మరోసారి ఫేమస్ కావాలంటే ఆల్ఫా సక్సెస్ కంపల్సరీ అన్నది ఆలియా చెబుతున్న మాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kethireddy Venkatarami Reddy: వైసీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయి
Gold and Silver: జెట్ స్పీడుతో దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు
అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !! ఆమెతోనే కలిసి వచ్చి..మాయమైన కిలాడీ దొంగ
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

