AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై కన్నకూతురిని నరికి చంపిన తండ్రి..

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెటాడి వెంటాడి నడి రోజుడ్డపై యువతిని అత్యంత క్రూరంగా చంపేశారు గుర్తు తెలియని దుండగులు.

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై కన్నకూతురిని నరికి చంపిన తండ్రి..
Woman
Shiva Prajapati
|

Updated on: May 27, 2022 | 4:45 PM

Share

Telangana: తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. నడి రోజుడ్డపై కన్న కూతురుని అత్యంత క్రూరంగా నరికి చంపేశాడు ఓ తండ్రి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం నాగల్ కొండలో చోటు చేసుకుంది. హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగల కొండ గ్రామానికి చెందిన పవార్ రాజేశ్వరి(21) మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన షేక్ అలీం అనే యువకుడిని మతాంతర వివాహం చేసుకుంది. అయితే, రెండు వారాల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టి రాజేశ్వరిని, షేక్ అలీంను విడదీస్తూ గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. అయితే, తనకు తన భర్తే కావాలంటూ ఇవాళ ఉదయం తండ్రి పవార్ దేవిదాస్ తో గొడవకు దిగింది రాజేశ్వరి. దాంతో తమ కుటుంబ పరువు తీశావంటూ ఆగ్రహించిన దేవిదాస్.. నడి రోడ్డుపై కూతురు గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసిన పవార్.. తన కూతురును ఎవరో చంపేశారంటూ సమాచారం ఇచ్చాడు. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల విచారణలో తండ్రి దేవిదాసే హత్య చేసినట్లుగా గుర్తించారు. తల్లి పవార్ సావిత్రి బాయి ఎదుటే కన్నబిడ్డను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. మతాంతర వివాహం చేసుకుందని, తమ పరువు తీసిందనే ఆగ్రహంతోనే కూతురుని దేవిదాస్ హత్య చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..