Hyderabad: ఏంటి మేడమ్ గారూ ఇది.! చిన్నారిని ఎత్తుకుని మహిళ చేసిన పనికి అంతా షాక్‌

హైదరాబాద్‌ నగరంలో జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం మానేయాలని చెప్పాల్సిన మహిళలే.. ఆ మద్యాన్ని కొనుగోలు చేస్తే.. ఓ సారి ఈ వీడియో చూసేయండి మరి. లేట్ ఎందుకు ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

Hyderabad: ఏంటి మేడమ్ గారూ ఇది.! చిన్నారిని ఎత్తుకుని మహిళ చేసిన పనికి అంతా షాక్‌
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Oct 15, 2025 | 8:33 AM

హైదరాబాద్‌ నగరంలో జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌ ప్రాంతంలోని ఓ మద్యం షాపులో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఓ విదేశీ మహిళ చిన్న పాపను ఎత్తుకుని మద్యం షాపులోకి వెళ్లి మందు కొనుగోలు చేయడంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనను ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

విదేశీ మహిళ ఒక ఆటోలో ఫిల్మ్‌నగర్‌లోని వైన్స్ షాప్‌ దగ్గరకు చేరుకుంది. ఆటో దిగిన అనంతరం చిన్నపాపతో పాటు నేరుగా మద్యం షాపులోకి వెళ్లి మద్యం ఎంపిక చేసుకుని కొనుగోలు చేసింది. సాధారణంగా మద్యం షాపుల్లోకి పిల్లలను తీసుకెళ్లడం అత్యంత అరుదైన సంఘటన. అక్కడివారు ఈ దృశ్యాన్ని చూడగానే షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన కొద్ది సమయంలోనే వైరల్ అయ్యింది. అందుకు అనుగుణంగా నెటిజన్ల నుంచి విభిన్న ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. కొందరు తల్లి అయిన మహిళ ఇలా చేయడం సరికాదు.. పాప ఎదుగుతున్న సమయంలో ఇలా మందు షాపుల్లోకి తీసుకెళ్లడం వలన ఏం అభిప్రాయం వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

ఇవి కూడా చదవండి

మరికొందరు ఇది ఆమె వ్యక్తిగత జీవితం.. అయినా చిన్నారి భద్రత పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం మద్యం కొనడం మహిళ స్వేచ్ఛే అయినా ఒక చిన్నారిని తీసుకెళ్లి అటువంటి ప్రదేశంలో నిలబెట్టడం చిన్నపిల్లల మనోవికాసాన్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల హక్కుల పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి ప్రవర్తనను నిరూపించడంలో సమాజం పాత్ర కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నదీ స్పష్టంగా తెలియలేదు. అయితే వీడియో వైరల్ కావడంతో ఇది చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, సైబర్ క్రైం పోలీసులకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. పాపకు ఎలాంటి హాని జరగకపోయినా, భవిష్యత్‌లో ఇలాంటి ఉదాహరణలు పునరావృతం కాకుండా చూస్తే మంచిదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా