Cloudburst: కేసీఆర్ కామెంట్స్‌తో ​క్లౌడ్​ బరస్ట్​పై సర్వత్రా చర్చ.. అసలు దీని అర్థం ఏంటి..?.. ​క్లౌడ్​ బరస్ట్ అయితే ఏమవుతుంది..?

రాష్ట్రంలో విపరీత వర్షాలు విదేశీ కుట్ర అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. కుండపోత వర్షాలకు ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. కేసీఆర్‌ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

Cloudburst: కేసీఆర్ కామెంట్స్‌తో ​క్లౌడ్​ బరస్ట్​పై సర్వత్రా చర్చ.. అసలు దీని అర్థం ఏంటి..?.. ​క్లౌడ్​ బరస్ట్ అయితే ఏమవుతుంది..?
Cloudburst
Follow us

|

Updated on: Jul 17, 2022 | 8:34 PM

Telangana Floods: మేఘాలను మేనేజ్‌ చేయొచ్చా..? ఆకాశాన్ని అదిమిపట్టొచ్చా..? ఆర్టిఫిషియల్‌ రెయిన్‌ అంత ఈజీయా..? క్లౌడ్‌ బరస్ట్‌తో క్లీన్‌ బౌల్డేనా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడంతా క్లౌడ్‌ బరస్ట్‌పైనే చర్చ..! లోకల్‌ టు గ్లోబల్‌ మేఘాల చుట్టూ బిగ్‌ డిబేట్‌ నడుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా..? మేఘం బద్దలైందా..? వర్షమంటే ఇలా కూడా పడుతుందా..? ఇటీవల కురుస్తున్న వర్షం చూస్తే ఎవరికైనా ఇలాంటి డౌటే వస్తుంది. కుండను కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి అనుభవమే ఎదురవుతోంది. గంటల వ్యవధిలో అంతా మునిగిపోతోంది. వందేళ్లలో ఎన్నడూ చూడని వర్షం జనాలను అతలాకుతలం చేస్తోంది. వర్ష బీభత్సం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొన్నటిదాకా తెలంగాణలో కురిసిన వర్షాలు జలప్రళయాన్నే మిగిల్చాయి. ఇంతకీ తెలంగాణలో నాన్‌స్టాప్‌ వర్షాలకు రీజనేంటి..? గోదావరి(Godavari River) మహోగ్రరూపం వెనుక ఆంతర్యమేంటి..? క్లౌడ్ బరస్టే దీనంతటికీ కారణమా..? క్లౌడ్‌ బరస్ట్‌ వెనుక విదేశీ శక్తుల కుట్రలున్నాయా..? గోదావరి పరివాహక ప్రాంతాన్ని టార్గెట్ చేసి వర్షాలు కురిపిస్తున్నాయా..? వాతావరణ పరిస్థితుల్లో మార్పులకి అసలు కారణమేంటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. క్లౌడ్‌ బరస్ట్‌పై లేటెస్ట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM Kcr) చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. క్లౌడ్‌ బరస్ట్‌పై విదేశీ కుట్రలు నిజమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్‌ చెప్పినట్టుగా కశ్మీర్‌, లేహ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌గానే విపత్తులు తలెత్తాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టి క్లౌడ్‌ బరస్ట్‌పై పడింది. రాజకీయ రచ్చ ఎలాగున్నా ఇటీవలి అమర్‌నాథ్‌ విపత్తు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. దీనివెనుక విదేశీయుల కుట్ర దాగి ఉందా అన్న దానిపై పెద్ద చర్చే నడిచింది. ఇటీవల అమర్‌నాథ్‌ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. అమర్‌నాథ్‌ గుహ దగ్గర కుంభవృష్టిగా కురిసిన వానతో క్లౌడ్‌ బరస్ట్‌ అన్న పదం మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోయారు. ఆకస్మిక వరదల సమయంలో అక్కడ 10 నుంచి 12 వేల మంది భక్తులు ఉన్నారు. ఈ అనుకోని ఉత్పాతానికి క్లౌడ్‌ బరస్టే కారణమని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా- అకస్మాత్తుగా వచ్చిన వరదలతో భక్తులు చెల్లాచెదరయ్యారు. భక్తుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. సైన్యం, NDRF బృందాలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాత్కాలికంగా అమర్‌నాథ్‌ యాత్రను నిలిపేశారు. ఆకస్మిక వరదకు క్లౌడ్‌ బరస్టే కారణమని స్పష్టం చేశారు ITBP అధికారులు. జలవిలయం… ఈ పేరెత్తితేనే… వెన్నులో వణుకుపుట్టుకొస్తుంది. ఉత్తరాఖండ్‌ వరుసగా ఇలాంటి ప్రకృతి విపత్తులనే ఎదుర్కొంటోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో క్లౌడ్‌ బరస్ట్ తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇంతకీ వరుణ విధ్వంసానికి కారణమేంటి..? అకస్మాతుగా వాతావరణంలో మార్పులు ఎందుకు జరుగుతాయన్న ప్రశ్నలకు క్లౌడ్‌ బరస్ట్‌ సమాధానమే వినిపిస్తోంది. మొత్తంగా ఈ క్లౌడ్‌ బరస్ట్‌ మానవ సృష్టా.. ప్రకృతి విపత్తా అన్నదానిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

క్లౌడ్‌ బరస్ట్‌ అంటే ఏంటి..?

వాతావరణ శాఖ అందిస్తున్న వివరాల ప్రకారం… ఒక నిర్దేశించిన ఏరియాలో… ఒకటి నుంచి 10కిలోమీటర్ల లోపు వ్యాసార్ధంలో… గంటకు 10సెంటీ మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. కొద్ది సేపట్లోనే ఊహకందనంత వర్షం కురుస్తుంది. కొన్ని సార్లు ఒకే ఏరియాలో చాలాసార్లు క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉంది. కృత్రిమంగా కూడా క్లౌడ్ బరస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.  సిల్వర్ అయోడైడ్ బుల్లెట్లు భారీ వర్షాలకు కారణమయ్యే నీటి కణాల ఘనీభవనానికి కారణమవుతాయని.. తద్వారా ఈ క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని సైన్స్ చెబుతోంది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలో స్టేడియాల లోపాలను పరిశీలించేందుకు క్లౌడ్ బరస్ట్ ద్వారా చైనా వర్షాన్ని కురపించింది. క్లౌడ్ సీడింగ్ ద్వారా కూడా కృత్రిమ వర్షాన్ని గతంలో సృష్టించిన దాఖలాలు ఉన్నాయి. మేఘాలు కమ్మినప్పుడు డ్రోన్లను మేఘాల మధ్యకు పంపించి వాటి ద్వారా విద్యుత్ షాక్ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా అవి కలిసిపోయి వర్షం సృష్టించేందుకు ప్రేరేపిస్తాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..