Telangana Politics: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్.. అసెంబ్లీలో పొలిటికల్ వార్.. ఎవరి వ్యూహం వారిదే..!
Weekend Hour With Murali Krishna: బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే... దేనికైనా రెడీ అని ప్రధాన ప్రతిపక్షం తేల్చిచెప్పింది. గతాన్ని గుర్తూ చేస్తూ గులాబీ పార్టీని కట్టడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుంటే.. ఆ గతాన్నే తమ బలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది కేసీఆర్ టీమ్.

Weekend Hour With Murali Krishna: బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే… దేనికైనా రెడీ అని ప్రధాన ప్రతిపక్షం తేల్చిచెప్పింది. గతాన్ని గుర్తూ చేస్తూ గులాబీ పార్టీని కట్టడి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుంటే.. ఆ గతాన్నే తమ బలంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది కేసీఆర్ టీమ్.
తెలంగాణలో రాజకీయం ఏ రకంగా ఉండబోతోందనే అంశంపై అసెంబ్లీ సమావేశాలతోనే దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా తొలి సమావేశాలు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా తొలి సమావేశాలే హాట్ హాట్‌గా సాగాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించాయి.
ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.
గత పాలనలోని లోపాలను బయటపెట్టడం ద్వారా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే.. బీఆర్‌ఎస్ అందుకు కౌంటర్ రెడీ చేసినట్టు వారి కామెంట్స్ బట్టి అర్థమవుతోంది. కాంగ్రెస్ చేసే ఆరోపణలకు తమదైన శైలిలో సమాధానం ఇస్తోంది.
తొలి సమావేశాల్లోనే అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్‌లో సాగింది. కాంగ్రెస్ సర్కార్ శాఖలవారీగా శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తామని చెబుతుండటంతో.. రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
వీకెండ్ అవర్ విత్ మురళీ కృష్ణ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..