Weather Report: తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్ష సూచ‌న.. రానున్న 48 గంట‌ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Weather Report: తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్ష సూచ‌న చేసింది వాతావ‌ర‌ణ‌శాఖ‌. రానున్న 48 గంట‌ల్లో ఏపీ, తెలంగాణ‌ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప‌డుతుంద‌ని

Weather Report: తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్ష సూచ‌న.. రానున్న 48 గంట‌ల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Andhra Pradesh Weather Report
Follow us

|

Updated on: Feb 20, 2021 | 10:05 PM

Weather Report: తెలుగు రాష్ట్రాల‌కు వ‌ర్ష సూచ‌న చేసింది వాతావ‌ర‌ణ‌శాఖ‌. రానున్న 48 గంట‌ల్లో ఏపీ, తెలంగాణ‌ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప‌డుతుంద‌ని వెల్లడించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర మీదుగా కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్‌తో పాటు, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖాధికారి నాగరత్నం.

నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు హైదరాబాద్ లో 50 నుంచి 60% ప్రాంతమంతా మేఘావృతం అయి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వర్షాలు ప‌డ‌తాయ‌ని సూచించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఒక‌ట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

దేశ రాజధానిలో చల్లని వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. మరో మూడు రోజులు అక్కడ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ అవాంతరాల కారణంగా ఆదివారం నుంచి 25 వరకు కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉంటాయని పేర్కొంది.

ఇక తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అసలే కరోనా మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమయంలో వర్షాలు పడుతుండడం టెన్షన్ పుట్టిస్తోంది. చలిగాలులకి మళ్లీ వైరస్ ఎక్కడ పంజా విసురుతుందోనని నగర జనం హడలిపోతున్నారు. వర్ష సూచనతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కోతి చేసిన పని.. ఇలా కూడా చేస్తాయా అంటూ నెటిజన్ల కామెంట్స్

Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..