
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. ఇప్పటికే తెలంగాణలో వాతావరణ మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. ఇప్పుడు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా కూల్‌కూల్‌గా మారిపోయింది. ఈసారి మార్చి నెల ప్రారంభంతోనే ఎండల తీవ్రత పెరిగింది. ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈటైమ్‌లో వెదర్ ఒక్కాసారిగా మారింది. ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. వడగళ్లు, ఈదురు గాలులలతో చాలా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ ఇలా అన్ని చోట్లా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. రేపు, ఎల్లుండి కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్‌ను బట్టి అంచనా వేస్తున్నారు.
ద్రోణి ప్రభావం కారణంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. మరో మూడు రోజులపాటు తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా చిరుజల్లులతో వాతావరణం కూల్‌గా మారిపోయింది.
హైదరాబాద్‌లో మామూలు సమయాల్లో మధ్యాహ్నం అంటే టెంపరేచర్ 30 నుంచి 33 డిగ్రీల వరకూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వర్షాల ఎఫెక్ట్‌తో 20 డిగ్రీలకు తగ్గింది. ఉక్కపోతలతో అల్లాడిపోతున్న జనానికి ఈ వర్షాలు కాస్త ఊరట ఇచ్చాయనే చెప్పాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..