అంగారకునిపై జల-జీవ ఆనవాళ్లు…!

మానవుడు భూమి మీదే ఉంటాడా. మిగతా చోట్ల జీవ జలం ఉండదా. మిగతా గ్రహాల్లో ఎవరు ఉండరా అనే అనుమానం చాలా కాలంగా మనిషిని తొలుస్తున్న ప్రశ్న. ఈ విషయం పై చాలా పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కొన్ని వింత జీవులు, కొత్త జంతువులు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఫలితంగా సందేహాలు పెరుగుతున్నాయి. ఏలియన్స్ లాంటి వ్యక్తులు ఉన్నారేమో అనే వాదన ఎప్పటి నుంచో వింటున్న మాటనే. కానీ ఇప్పుడు గ్రహాల పై నీటి ఆనవాళ్లు దొరికాయి. […]

అంగారకునిపై జల-జీవ ఆనవాళ్లు...!
Follow us

|

Updated on: Jan 09, 2020 | 3:55 PM

మానవుడు భూమి మీదే ఉంటాడా. మిగతా చోట్ల జీవ జలం ఉండదా. మిగతా గ్రహాల్లో ఎవరు ఉండరా అనే అనుమానం చాలా కాలంగా మనిషిని తొలుస్తున్న ప్రశ్న. ఈ విషయం పై చాలా పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కొన్ని వింత జీవులు, కొత్త జంతువులు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఫలితంగా సందేహాలు పెరుగుతున్నాయి. ఏలియన్స్ లాంటి వ్యక్తులు ఉన్నారేమో అనే వాదన ఎప్పటి నుంచో వింటున్న మాటనే. కానీ ఇప్పుడు గ్రహాల పై నీటి ఆనవాళ్లు దొరికాయి. చాలా కాలం నుంచి ఇదే మాట చెబుతున్నా…ఇప్పుడు ఒక నిర్థారణకు వచ్చారు వాళ్లు.

అంగారక గ్రహం పై జీవ జలం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. భూమి మీద సూక్ష్మ జీవుల నివాసానికి సహకరించే పరిస్థితులే అక్కడా ఉన్నాయని గుర్తించారు. అంగారకుడిలో గల ఫిర్సాఫ్‌లో గల అరేబియా టెర్రా లోని ఈక్విటోరియల్ లేయర్డ్ డిపాజిట్స్‌ను (ఈఎల్డీ) పరిశీలించాక ఈ మాట చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నివాస యోగ్యతకు ఉపయోగపడుతుందా లేదా అని ఇక్కడి పర్వత ప్రాంతాల్లో పరిశోధన చేశారు. ఈఎల్డీలు ఉండే ఫలకంపై అరుదైన మట్టి దిబ్బలు, ఇసుక తిన్నెలు, పలు నిక్షేపాలు, కొండలు, సమతల ప్రాంతాలను పరిశోధకులు గుర్తించారు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ప్లానెటరీ సైన్సెస్, ఇటలీకి చెందిన మోనికా పాండ్రెల్లి, ఆమె సహచరులు ఈ మట్టిదిబ్బలు, ఇసుక తిన్నెలు, సమతల ప్రాంతాలు ఏర్పడిన విధానాన్ని అర్థం చేసుకున్నారు. నీటి ఊటల ఉనికి, నీరు ఆవిరైన ప్రాంతాల గుర్తింపు లాంటివి ఇక్కడ హైడ్రోలాజికల్ సైకిల్(జలచక్రం) ఉనికిని తెలుపుతున్నాయి. ఈఎల్డీ నిక్షేపణకు ఇక్కడి భూగర్భ జలం ఒడిదుడుకులు కారణమని వారు అంచనా వేశారు.

వారి మాటలకు బలం చేకూరుస్తున్నాయి నాసా శాస్త్రవేత్తల పరిశోధనలు. మార్స్ గ్రహం పైన సముద్రం ఉందనేందుకు ఆధారాలు లభించాయి. మార్స్ గ్రహాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ మాట చెబుతున్నారు. ఆన్సియెంట్ మార్స్ పైన నీరు ఉండేదని చెప్పారు. ఈ సముద్రం పరిమాణం ఆర్కిటిక్ మహాసముద్రం అంత ఉండేదని అర్థమవుతోంది. దీని పొడవు గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువే ఉండేదని చెప్పారు. ఆ నీళ్లు మార్స్ లోతట్టు ప్రాంతమైన నార్తర్న్ హెమీస్పియర్ పైన ఉండేదని నిర్థారణకు వచ్చారు. అది మిలియన్ల సంవత్సరాలు అలా ఉందని తెలుసుకున్నారు. ఇది మరింత శోధించేందుకు ఉపయోగపడుతుంది. ప్లానెట్ చరిత్ర మరింత తెలుసుకోవచ్చునని చెప్పారు. మార్స్ పైన నార్తర్న్ ఓసియన్ ఉన్న విషయమై దశాబ్దాలుగా చర్చ సాగుతోందని, అయితే, మొదటిసారి తాము కచ్చితంగా దానిని ఉన్నట్లుగా తెలుసుకున్నామని నాసా గొడార్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రో బయోలజీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ ముమ్మా అన్నారు.

జలం ఆనవాళ్లు…

అంగారక గ్రహంపై జలప్రవాహానికి సంబంధించిన జాడల్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చెబుతూ వస్తోంది. ఈ గ్రహంపై జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావించడమే ఇందుకు కారణం. కానీ జలప్రవాహ ఆధారాలతో ప్రస్తుతం జీవం మనుగడ ఉండొచ్చని నాసా స్పష్టం చేసింది. గతంలో భావించినట్లుగా అంగారకుడు పొడి, నిర్జల గ్రహం కాదని నాసా ప్లానెటరీ సైన్స్‌ సంచాలకులు జిమ్‌గ్రీన్‌ మరో పరిశోధన ద్వారా చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో జలప్రవాహాన్ని గుర్తించారు. అంగారకుడి ఉపరితలంపై వేసవి కాలంలో ఉప్పునీటి ప్రవాహాలు ఉండొచ్చనే అంశానికి తొలిసారిగా శాస్త్రవేత్తలు ఆధారాల్ని నిర్ధారించారు. గ్రహం ఉపరితలంపై ఏటవాలుగా కనిపిస్తున్న ఆకృతులు ఉన్నాయి. ఉప్పునీటి ప్రవాహాలకు సంబంధించిన చారికలుగా వాటిని భావిస్తున్నారు. ఇవి గ్రహాంతరంలో ద్రవరూప జలానికి ఆధారంగా విశ్వసిస్తున్నారు. తాము గడ్డ కట్టిన ఉప్పు ఖనిజాలను గుర్తించామనీ, అవి ఏర్పడేందుకు నీరు అవసరమని అమెరికా, ఫ్రాన్స్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

ప్రస్తుతం అంగారకుడిపై జలం ఉందనే అంశానికి ఈ ఫలితాలు బలమైన ఆధారాన్ని ఇస్తున్నాయి. రికరింగ్‌ స్లోప్‌ లీనియా(ఆర్‌ఎస్‌ఎల్‌)గా వ్యవహరించే సీజనల్‌ చారికలు నీటి ప్రవాహాల కారణంగా ఏర్పడ్డవేనని చాలాకాలంగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అయితే, అంతరిక్ష నౌక రూపొందించిన చిత్రాలు పూర్తిస్థాయి స్పష్టత అందించలేకపోయాయి. నాసా మార్స్‌ పర్యవేక్షణ అంతరిక్షవాహనం అంగారకుడి ఉపరితలంపై గుర్తించిన రసాయన విశేషాల్ని విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరిచారు. అంగారకుడి మధ్యరేఖ వెంబడి ఇరుకైన కాలువల్లో నీటి సమక్షంలో మాత్రమే ఏర్పడే ఉప్పుకు సంబంధించి ఆధారాల్ని తెలుసుకున్నారు. ద్రవరూపంలోని జలాన్ని కనుగొన్నట్లు చెప్పడం లేదనీ, ఆవిరై పోయిన లవణాల్ని గుర్తించామని జార్జియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థి లూజేంద్ర ఓఝా మరో పరిశోధనలో తెలిపారు. ఆర్‌ఎస్‌ఎల్‌కు సంబంధించి ఛేదించాల్సిన రహస్యాలెన్నో ఉన్నాయని ఓఝా చెప్పడం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

జీవం ఉందట …

అంగారక గ్రహంపై జీవరాశి ఉందని, మానవ మనుగడకు మార్స్ ఉపయోగపడుతుందని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు కఠోర పరిశోధనలే చేశారు. ఈ క్రమంలో ఆ గ్రహంపై ఉనికిని కనుగొనేందుకు క్యూరియాసిటీ రోవర్ ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ మార్స్ రోవర్ ఆ గ్రహానికి చెందిన ఎన్నో చిత్రాలను పంపింది. ఇంకా పంపుతోంది. అది పంపిన ప్రతి చిత్రాన్ని ఏలియన్‌ హంటర్లు విశ్లేషించారు. అంగారకుడిపై జీవరాశి ఉనికిని కనుకున్నారు. క్యూరియాసిటీ రోవర్‌ పంపిన అంగారకుడి చిత్రాల్లో కొన్ని జంతువుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు వెల్లడించారు. ఓ చిత్రంలో వెంట్రుకలు కలిగిన నాలుగు కాళ్ల సాలెపురుగులా పాకుతున్న ఓ జంతువును గుర్తించారు. సాలెపురుగులా పాకుతున్నా చూసేందుకు అచ్చం కోతిలా ఉందని అంచనా వేశారు. ఇంకొన్ని చిత్రాల్లో నత్త, మరో పాకుతున్న జంతువును గుర్తించారు.

భద్రతా కారణాల వల్ల అమెరికా ప్రభుత్వం చాలా విషయాలను రహస్యంగా ఉంచింది. మార్స్ నుంచి క్యూరియాసిటీ రోవర్ ఎన్నో ఫోటోలు పంపుతోంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు చాలానే ఉన్నాయి. నాసా క్యూరియాసిటీ రోవర్‌ తీసిన అంగారక గ్రహం చిత్రాల్లో రాళ్ల మధ్య ఓ ఉడత కనిపిస్తోంది. దాని చెవులు, ముక్కు, కళ్లు, ముందు కాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అంగారకుడిపై జీవం ఉందన్న విషయాన్ని నాసా ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోందనే వాదన సాగుతోంది. జంతు హక్కుల సంఘాలు ఆందోళన చేస్తాయన్న కారణంతో జంతువులను వినియోగించే విషయంలో రహస్యంగా ఉంచారనే చర్చ లేకపోలేదు. నాసా రహస్య ప్రయోగాలను నిర్వహిస్తుంటుందని చాలా మంది చెబుతున్నారు.

అంగారకుడి ఉపరితలంపై నుంచి జారిన నీటి ప్రవాహం అంగారకుడి ఉపరితలంపై నుంచి జారిన నీటి ప్రవాహం అంగారకుడి ఉపరితలంపై గాలిలో తేమ, నేల తడిగా ఉన్నట్లు రోవర్లు గుర్తించాయి. ఏటవాలుగా ఉన్న అంగారకుడి ఉపరితలంపై నుంచి జారిన నీటీ ప్రవాహం సంబంధించిన నల్లటి చారలను నాలుగేండ్ల క్రితమే గుర్తించారు. ఈ నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం కారణంగానే ఇలాంటి ఎత్తుపల్లాలు ఉంటాయని చెబుతున్నారు. శీతాకాలంలో ఇలాంటి చారలు ఏర్పడి.. వేసవిలో పెరుగుతాయని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే వర్షకాలంలో అవి తుడిచిపెట్టుకుపోతాయనే శాస్త్రవేత్తల వాదన. తాము చేసిన పరిశోధనలతో నీటి ప్రవాహం కారణంగానే ఇలాంటి ఎత్తుపల్లాలు వచ్చాయని వారు చెబుతున్న మాట. ఇక్కడ ఉన్న నీరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నట్లు తేలిందన్నారు.

మొరాకోలోని ఒక ఎడారిలో పడిన అంగారకుడి తాలూకు గ్రహశకలాన్ని పరిశోధించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొత్త విషయాలను గతంలోనే తెలిపారు. గ్రహశకలం పగుళ్లలో ఉన్న సేంద్రియ కర్బన అవశేషాలపై వీరు అనేక పరీక్షలు జరిపారు. వాటి మూలం గురించి తెలుసుకున్నారు. గ్రహశకలం అంగారకుడిని వీడకముందే దాని మీద కర్బన మూలకం చేరినట్లు గుర్తించారు. తద్వారా అరుణగ్రహం మీద జీవం ఉనికిలో ఉందని లేదా గతంలో ఉండేదని చెప్పటానికి ఆధారం దొరికింది. మరిన్ని పరిశోధనలు జరిగితే గానీ వాస్తవం ఏంటనేది తెలియదు. ఇతర గ్రహాల పై జీవం, జలం ఆనవాళ్లు కనుక్కున్నా..ఇప్పటికిప్పుడు చేసేది ఏమి ఉండదు. కానీ మనిషికి తెలియని ఎన్నో అంతరిక్ష రహస్యాలను ఈ పరిశోధనల ద్వారా తెలుసుకునే వీలుంది. తద్వారా మానవాళికి ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణలు వస్తాయి. అంతే కాదు..గ్రహాంతర వాసులు ఉంటే వారితో మాట్లాడే ప్రయత్నాలు జరగవచ్చు. ముందస్తు జాగ్రత్తల వల్ల వారి నుంచి మానవాళికి వచ్చే ముప్పును తప్పించే వీలుంది.

-కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9.