Warangal: ఆస్తికోసం సొంత తమ్ముడిని దారుణంగా చంపిన అన్న.. ఊరందరి కళ్లెదుటే ఘోరం
ఆస్తి వ్యవహారం అన్నదమ్ముల మధ్య చిచ్చురేపింది. తన వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి తమ్ముడు ప్రయత్నించడం ఇష్టం లేని అన్నే తమ్ముడిని ఇంట్లో బంధించి అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇరుగు పొరుగు వారు చొద్యం చూస్తున్నారే గానీ ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయకపోవడం..
ఆస్తి వ్యవహారం అన్నదమ్ముల మధ్య చిచ్చురేపింది. తన వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి తమ్ముడు ప్రయత్నించడం ఇష్టం లేని అన్నే తమ్ముడిని ఇంట్లో బంధించి అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇరుగు పొరుగు వారు చొద్యం చూస్తున్నారే గానీ ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసులకు కూడా ఫోన్ చేయకపోవడం విడ్డూరంగా ఉంది. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాన్ని ముగ్గురు అన్నదమ్ములు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. ఐతే పెద్దవాడైన శ్రీనివాస్ మృతి చెందాడు. ఆ వాటా చిన్నవాడైన శ్రీకాంత్‌కు ఇవ్వనని తెగేసి చెప్పాడు అన్న శ్రీధర్. ఇక్కడుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలసి నిజామాబాద్‌కు వెళ్లి కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2019లో అక్కడి అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తనకు వాటాగా వచ్చిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. ఆ విషయమై నిజామాబాద్ నుంచి ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి యత్నించగా సోదరుడు శ్రీధర్ అడ్డుపడి బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిన శ్రీకాంత్ ఏప్రిల్ 7న మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో సోదరుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీధర్‌ను స్టేషన్ పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వగా.. తన తమ్ముడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.
అన్నమాటలు నమ్మిన శ్రీకాంత్ భార్యతో కలసి వరంగల్‌కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలు చేశాడు. ఈక్రమంలో శనివారం ఇద్దరు కొనుగోలుదారులను వెంట తీసుకొని స్థలం వద్దకు వెళ్లగా శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్‌పై దాడి చేశాడు. శ్రీకాంత్‌ను ఇంట్లోకి లాక్కుపోయి, పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. బయటికి రాకుండా తలుపు వద్ద బండరాయి అడ్డుగా పెట్టాడు. ఎలాగోలా శ్రీకాంత్ ఇంట్లో నుంచి వయటపడి బజార్లో పరుగులు తీయగా అందరూ చూస్తుండగానే శ్రీకాంత్ రాయితో కొట్టి శ్రీధర్‌ను హత్యచేశాడు. అనంతరం శ్రీధర్, అతని భార్యాపిల్లలు ఇల్లు వదిలి పారిపోయారు. ఇంత జరుగుతున్నా స్థానికులెవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.