CM KCR Warangal Tour : వరంగల్ జిల్లాల పేర్లలో మార్పు చేసిన సీఎం కేసీఆర్.. తెరపైకి కొత్తగా హన్మకొండ జిల్లా..?
CM KCR Warangal Tour : సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు అభివృద్ధి
CM KCR Warangal Tour : సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్.. కాళోజీ ఆరోగ్య వర్సిటీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సూపర్ స్పెషాలటీ ఆస్పత్రికి భూమి పూజ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నట్టు తెలిపారు. ఇకపై వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని వెల్లడించారు.
ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వరంగల్ ఆటో నగర్, ఆజాంజాహి మిల్లు గ్రౌండ్‌లో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మిస్తే తూర్పు ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అంతేకాకుండా జిల్లాకు డెంటల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. వరంగల్ పరిశ్రమలకు కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కొత్తగా జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన కారణంగా.. వరంగల్ విద్యా, వైద్యానికి కేంద్రంగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ప్రపంచలోనే వైద్య సేవలు కెనడాలో బాగున్నాయని అంటారు.. అక్కడ వైద్యశాఖ అధికారులు, మంత్రి పర్యటించి వైద్యసేవలను పరిశీలించండని అన్నారు.