Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో హీటెక్కిస్తున్న బురద రాజకీయం.. వరద సాయంపై మాటల తూటాలు..

తెలంగాణలో వర్షాలు తగ్గాయి. వరద తగ్గింది. కానీ బురద రాజకీయం ఎడతెరిపిలేకుండా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బాధితులకు అండగా నిలవడంలో అధికార పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తే..వరదలను కూడా గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది.

Telangana: తెలంగాణలో హీటెక్కిస్తున్న బురద రాజకీయం.. వరద సాయంపై మాటల తూటాలు..
Khammam Floods
Shaik Madar Saheb
|

Updated on: Sep 08, 2024 | 7:07 PM

Share

తెలంగాణలో వర్షాలు తగ్గాయి. వరద తగ్గింది. కానీ బురద రాజకీయం ఎడతెరిపిలేకుండా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదలతో బాధితులు సర్వం కోల్పోయారు. వరద వల్ల ఇళ్లలో చేరిన బురదను క్లీన్ చేసుకుంటున్నారు. ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులు పనికిరాకుండా పోయాయి. పంటలు వరదలకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఆదుకుంటుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే బాధితులను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు వరదసాయంపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. రాకాసితండాలో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. పంట పొలాల్లో ఇసుక మేటను తొలగించి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారు. వరద నష్టంపై పొంగులేటి కిషన్ రెడ్డికి వివరించారు.

బీఆర్ఎస్ ఫైర్..

కాగా.. వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్‌ నేత బాల్క సుమన్‌. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

తాము బీఆర్ఎస్‌లా కేంద్రానికి అబద్దాలు చెప్పలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విపత్తు వేళ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. ప్రతిపక్ష పార్టీ వరదలపై రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద వెళ్లి వారం దాటినా కాల్వలను క్లీన్ చేయకుండా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తక్షణం చర్యలు చేపట్టాలంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..