Telangana: హైదరాబాద్‌కి రాబోతున్న మరో అంతర్జాతీయ సంస్థ.. 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు..

|

May 21, 2023 | 6:00 PM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రాష్ట్రంలోని వ్యాపార అనుకూల వాతావరణానికి ఫిదా అవుతున్న దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో..

Telangana: హైదరాబాద్‌కి రాబోతున్న మరో అంతర్జాతీయ సంస్థ.. 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు..
Minister Ktr With Erika Bogar King
Follow us on

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తన అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగేలా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రాష్ట్రంలోని వ్యాపార అనుకూల వాతావరణానికి ఫిదా అవుతున్న దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐటీ అనుబంధ సేవా రంగంలో హైదరాబాద్‌ వేదికగా తమ డెలివరి సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బెయిన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌కు చెందిన ‘VXI గ్లోబల్ సొల్యూషన్స్’ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో హ్యూస్టన్‌లో జరిగిన సమావేశం అనంతరం VXI గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌(CHRO) ఎరికా బోగర్‌కింగ్‌ ఈ మేరకు వెల్లడించారు.

హోస్టన్‌లో జరిగిన సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్.. తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా మారిందో ఎరికా బోగర్ కింగ్‌కు వివరించారు. ప్రగతిశీల విధానాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కల శ్రామిక శక్తి తెలంగాణలో ఉన్నందునే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్న విషయాన్ని కేటీఆర్ ఎరికాతో ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇవి కూడా చదవండి

ఇంకా డెలవరీ సెంటర్ ఏర్పాటు చేయాలన్న VXI గ్లోబల్ సొల్యూషన్స్ నిర్ణయంతో ‘టెక్ కంపెనీల గమ్యస్థానం హైదరాబాదే’ అన్న సంగతి మరోసారి స్పష్టమైందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో డైనమిక్ బిజినెస్ ఎకోసిస్టమ్ కారణంగానే తాము డెలవరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని VXI గ్లోబల్ సొల్యూషన్స్ తెలిపింది. మొదటి 3 సంవత్సరాల్లోనే 5 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సదరు సంస్థ వెల్లడించింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ గ్లోబల్ సెంటర్ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..