Telangana: సీటు కోసం ఇద్దరు మహిళల సిగ పట్లు.. జుట్టు జుట్టు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారుగా..
మణుగూరు ఆర్టీసీ బస్సులో సీటు పంచాయతీ..బస్సులో కూర్చునేందుకు సీటు విషయంలో ఇద్దరు మహిళలు సిగ పట్లు పట్టుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్ అశ్వాపురం పోలీస్ స్టేషన్ వద్ద బస్సును నిలిపివేశాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు మహిళలను మందలించి వేరు వేరు బస్సుల్లో గమ్య స్థానానికి పంపించారు. ఈ ఘటన మణుగూరు నుంచి భద్రాచలం వెళ్ళే బస్సులో జరిగింది.

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి రాస్త్రంలో నిత్యం ఏదో ఓచోట బస్సుల్లో మహిళల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల కోసం మహిళలు బస్సుల్లో కొట్టుకునే ఘటనలు రోజు ఎక్కడో ఓ చోట కనిపిస్తునే ఉన్నాయి, అలాంటిదే ఈ ఘటన కూడా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు. అది కాస్త మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు దారితీసింది, వీరి తిట్ల పురాణం, కొట్టుకున్న తీరును చూసి మిగిలిన ప్రయాణికులు నవ్వుకున్నారు. ఇద్దరు మహిళలను తోటి ప్రయాణికులు ఎంత వారిచ్చిన ఉపయోగం లేకపోవడంతో డ్రైవర్ బస్సును అశ్వాపురం పోలీస్ స్టేషన్ వద్ద నిలిపివేశారు.
సీటు కోసం మహిళల మధ్య జరిగిన గొడవ గురించి డ్రైవర్ పోలీసులకు తెలియజేయడంతో ఇద్దరు మహిళలను మందలించి వేరువేరు బస్సుల్లో ఆ మహిళలను పంపించారు పోలీసులు. బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు బాహాబాహికి దిగడం తోటి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం అనే పథకంఆర్టీసీ అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది అంటూ నవ్వుకుంటున్నారు జనం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




