Telangana: ఆ నలుగురు సీన్ రిపీట్.. యాచకుడికి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది..!

యాచకుడు మరణిస్తే ఊరంతా కదిలింది. అక్కడ ఊరు జనాలు మానవత్వం చూపారు. ఊరంతా విరాళాలు సేకరించి యాచకుడికి ఘనంగా అంత్యక్రియలు చేసి సంస్మరణం నిర్వహించారు.

Telangana: ఆ నలుగురు సీన్ రిపీట్.. యాచకుడికి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది..!
Last Rights To Beggar
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 05, 2024 | 1:43 PM

సాధారణంగా బిచ్చగాళ్ల ను చూస్తే ఈసడించుకుంటూ.. దూరంగా ఉంటారు జనాలు. కానీ ఆ యాచకుడు మరణిస్తే ఊరంతా కదిలింది. అక్కడ ఊరు జనాలు మానవత్వం చూపారు. ఊరంతా విరాళాలు సేకరించి యాచకుడికి ఘనంగా అంత్యక్రియలు చేసి సంస్మరణం నిర్వహించారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు ఆ గ్రామస్తులు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన అనాథ యాచకుడు తాటికొండ భాస్కర్(55) అనారోగ్యంతో మృతి చెందాడు. ఎన్నో దశాబ్దాల కాలంగా గొల్లెనపాడు గ్రామంలో వికలాంగుడైన తాటికొండ భాస్కర్ యాచక వృత్తిని చేపడుతూ నివసిస్తున్నాడు. అతనికి గ్రామ సచివాలయమే నివాసం. నిత్యం దేవాలయం వద్ద, గ్రామంలో ఇంటింటికి మూడు చక్రాలు బండిపై తిరుగతూ యాచిస్తున్నాడు. ఇలా వచ్చిన దానితోనే మూడు పూటలా కడుపు నింపుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. దాంతో గ్రామస్తులతో స్నేహ భావాన్ని పెంపొందించుకున్నాడు.

అయితే, గత కొన్ని రోజుల క్రితం భాస్కర్ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సపొందుతూ మృతి చెందాడు. నా అనేవాళ్లు లేకపోవడంతో గ్రామస్తులంతా ఒక తాటి పైకి వచ్చి విరాళాలు సేకరించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దాంతోపాటు అనాధ అనే భావన లేకుండా గ్రామస్తులు సంస్మరణ పెద్దకర్మ కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఇలా తోటి మానవుడిగా సగర్వంగా సాగనంపారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే