AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: 35 యేళ్లు దాటిన మహిళలూ ఈ టెస్ట్‌లు తప్పక చేయించుకోండి.. ఎందుకంటే?

చాలా మంది మహిళలు తమ ఆరోగ్యంపై అంత శ్రద్ధ తీసుకోరు. ముఖ్యంగా గృహిణులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే ప్రతి మహిళ 35 యేళ్లు దాటాక తప్పకుండా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

Women Health: 35 యేళ్లు దాటిన మహిళలూ ఈ టెస్ట్‌లు తప్పక చేయించుకోండి.. ఎందుకంటే?
Women Health
Srilakshmi C
|

Updated on: Nov 05, 2024 | 1:15 PM

Share

35 ఏళ్ల తర్వాత మహిళలు వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ వయస్సు తర్వాత క్యాన్సర్‌తో సహా అనేక ఇతర తీవ్రమైన వ్యాధులు వారి శరీరంలో సైలెంగ్‌ అభివృద్ధి చెందుతాయట. కాబట్టి 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళ కొన్ని ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ప్రాణాంతక వ్యాధులను సకాలంలో గుర్తించి చికిత్స చేయవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత మహిళలు ఎలాంటి పరీక్షలు (జెనెటిక్ స్క్రీనింగ్ అండ్‌ పరీక్షలు) చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

గుండె సంబంధిత టెస్ట్‌లు

వయసు పెరిగే కొద్దీ గుండె బలహీనపడుతుంది. అందుకే స్త్రీలు జన్యు పరీక్షలో భాగంగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. హైపర్ కొలెస్టెరోలేమియా, హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటి వంశపారంపర్య వ్యాధులను దీని ద్వారా గుర్తించవచ్చు.

జన్యు స్క్రీనింగ్

ఈ పరీక్ష ద్వారా స్త్రీలో ఏ రకమైన జన్యుపరమైన వ్యాధినైనా గుర్తించవచ్చు. ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా, మహిళలు అనేక తీవ్రమైన జన్యు వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవచ్చు. జన్యు పరీక్షల ద్వారా మహిళల్లో ఏ రకమైన క్యాన్సర్‌నైనా కూడా గుర్తించవచ్చు.

అల్జీమర్స్

35 ఏళ్ల తర్వాత మహిళలు అల్జీమర్స్ పరీక్ష చేయించుకోవాలి. ఈ వ్యాధికి కారణం శరీరంలోని APOE జన్యువు. కాబట్టి ఇది జన్యు పరీక్షలో కూడా పరీక్షించబడుతుంది. ఇది అల్జీమర్స్ ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

గర్భాశయ క్యాన్సర్

35 ఏళ్ల తర్వాత గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఈ స్క్రీనింగ్‌లో HPP జన్యురూప పరీక్షతో పాటు, గర్భాశయ క్యాన్సర్ పరీక్షించబడుతుంది. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసులు మన దేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్ సంభావ్యతను తొలగించడానికి BRCA జన్యు పరివర్తన పరీక్ష.. 35 ఏళ్లు నిండిన ప్రతి మహిళ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం కోసం BCRA జన్యువును జన్యు స్క్రీనింగ్ పరీక్షలో పరీక్షించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.