- Telugu News Photo Gallery These are the results if you put a lamp on Betel Leaf, Check Here is Details in Telugu
Tamalapaku Deepam: తమల పాకు మీద దీపం పెడితే ఇన్ని ఫలితాలా.. ఊహించలేరు..
ప్రతీ పూజలో తమలపాకు అనేది ఖచ్చితంగా ఉండాలి. అన్ని రకాల పూజల్లో తమల పాకులను ఉపయోగిస్తూ ఉంటారు. తమల పాకు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమల పాకు చెట్లను ఇప్పుడు ఇంటి వద్ద కూడా పెంచుకుంటున్నారు. తమల పాకుతో దీపం పెట్టడం వల్ల ఎంతో మంచిది.. మరి అదెలాగో ఇప్పుడు చూడండి..
Updated on: Nov 05, 2024 | 1:01 PM

ఇంట్లో పూజలు ఉన్నా, వ్రతాలు ఉన్నా, శుభ సూచికమైన ఫంక్షన్లు జరిగినా ఖచ్చితంగా తమల పాకును ఉండాల్సిందే. తమల పాకును శుభానికి ప్రతీకగా చెబుతారు. తాంబూలంతో పాటు కూడా తమలపాకులను పెడతారు. తమలపాకు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మన ఇంట్లోని పెద్దలు తమలపాకు మీద దీపం పెట్టమని చెబుతూ ఉంటారు. కానీ పెద్దగా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. తమల పాకు కాడలో పార్వతీ దేవి, తమల పాకు మొదట్లో లక్ష్మీ దేవి, మధ్యలో సరస్వతీ దేవి కొలువై ఉంటుంది.

అందుకే తమల పాకులో దీపం వెలిగించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని, అనుకున్న కోరికలు నెరవేరతాయని చెబుతారు. తమల పాకు మీద దీపాలను వెలిగించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

జీవితంలో అపజయం అనేది ఉండదని.. పెద్దలు, శాస్త్రాలు చెబుతున్నాయి అయితే తమల పాకు దీపం మీరు కూడా పెట్టాలంటే.. ముందుగా ఆరు తమల పాకులను తీసుకోండి. తమలపాకులకు ఉన్న కాడల్ని తుంచుకోండి.

ఈ ఆకుల్ని ఇప్పుడు నెమలి పింఛంలా పెట్టుకోవాలి. దానిపైన మట్టి ప్రమిద ఉంచి.. తుంచిన కాడల్ని దీపంలో వేసి.. నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి. ఇలా తమల పాకులతో దీపం పెట్టడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )





























