రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే.. జాగ్రత్త.!
రాత్రి వేళలో చేసే కొన్ని పనుల వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ అవుతోందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఈ మధ్య యువకలుల్లో కూడా హార్ట్ ఎటాక్స్ అటాక్ పెరిగిపోతున్నాయి. నిద్ర మనకు చాలా ముఖ్యం. మంచి నిద్ర మనల్ని శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మంచిగా నిద్ర పోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తాజా పరిశోధన ప్రకారం, తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యను ప్రేరేపిస్తున్నట్లు తేలింది. అది క్రమేణా గుండెపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఏడు గంటల కంటే తక్కువ నిద్ర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మనదేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ నిద్రపోతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన తెల్లవారుజాముననే నిద్రలేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నిద్ర వల్ల స్త్రీల గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఏడు శాతం పెరుగుతుందని, నిద్ర వ్యవధి ఐదు గంటల కంటే తక్కువ ఉంటే 11 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.
ఆరోగ్యకరమైన గుండెకు ఏడెనిమిది గంటల నిద్ర ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తరచుగా నిద్రలో మేల్కొనడం, పేలవమైన నిద్ర అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ అధ్యయనం ప్రకారం ఎంత తక్కువ నిద్రపోతారో, భవిష్యత్తులో మీకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.