Free Bus: జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

Free Bus: జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

|

Updated on: Nov 05, 2024 | 10:49 AM

ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఫ్రీ. ఈ హామీనే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ హామీ ఫలించడంతో తెలంగాణలోనూ ఎన్నికల ప్రధానహామీగా కొనసాగింది. తెలంగాణలోనూ మహిళలు చేతిగుర్తుకు పట్టం కట్టడంతో పదేళ్ల తర్వాత ఇక్కడా కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు ఉచిత బస్సుపై పునరాలోచన చేయాల్సి ఉందంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్‌ ప్రకటించడం సంచలనంగా మారింది.

DK చెప్పినట్లు జనం ఉచిత బస్సు వద్దంటున్నారా? మాకు స్థోమత ఉంది.. టిక్కెట్టు కొనుక్కునే ప్రయాణం చేస్తామంటున్నారా..! జనం మాట ఎలా ఉన్నా.. కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ ఇదే మాట చెప్తున్నారు.. పబ్లిక్కే తమకు ఫ్రీ వద్దు అంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉచిత బస్సు విధానాన్ని సమీక్షిస్తామని ఆయన చెప్పడంతో.. దీని అమలుపై నెక్స్ట్‌ ఏ దిశగా అడుగులు పడుతున్నాయనేది ఉత్కంఠగా మారింది.

కర్నాటక ఆర్టీసీ కొత్తగా 20 “ఐరావత క్లబ్‌ క్లాస్” బస్సుల్ని లాంచ్ చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతోపాటు, DK శివకుమార్ పాల్గొన్నారు. అక్కడ మీటింగ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్టు కొనుక్కుని వెళ్లేందుకు మహిళలు ముందుకు వస్తున్న నేపథ్యంలో.. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్వీట్ల ద్వారాను, ఈ-మెయిళ్ల ద్వారాను చాలా మంది తమ అభిప్రాయం చెప్తున్నారని DK అన్నారు. 5 నుంచి 10 శాతం మంది ఫ్రీ వద్దు అంటున్నారన్నారు DK.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us