Watch: పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

Watch: పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

Anil kumar poka

|

Updated on: Nov 05, 2024 | 11:11 AM

ఇప్పుడంటే అలారమ్స్‌ వచ్చాయి గానీ.. పూర్వం నిద్రలేవాలంటే కోడి కూయాల్సిందే. కోడిపుంజు కూత వినపడిందంటే నిద్ర లేచే యాల్ల అయిందని లెక్క. కోడికూసుడుతోనే రైతులు నిద్రలేచి వ్యవసాయ పనులు మొదలు పెడతారు. మనిషి జీవన విధానంలో కోడికూత అనేది ఓ భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలో కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది. అసలు సూర్యోదయం అయినట్లు కోళ్లకు అంత కచ్చితంగా ఎలా తెలుస్తుంది..

కోడిపుంజు సూర్యోదయాన్ని ఎలా పసిగడతాయి.. మనుషుల కంటే ముందే అవి మేల్కోవడం వెనక సైంటిఫిక్ కారణం ఉందా.. అనే ప్రశ్నలు అనేక మందిని తొలుస్తూనే ఉన్నాయి. అయితే సూర్యోదయం సమయంలో కోడిపుంజు కూత వేయడానికి దాని శరీరంలో ప్రత్యేక నిర్మాణమే కారణం అంటున్నారు నిపుణులు. ఉదయం కోడి పుంజులు మత్రమే కూస్తాయి. కోడిపెట్టలు కూయవు. ఎందుకంటే కోడిపుంజుల మెదళ్లు సున్నితమైన కాంతిని సైతం గ్రహిస్తాయట. కోళ్లు చాలా సున్నితమైనవని.. వీటిలో గ్రహణ శక్తి అధికంగా ఉంటుందట. ముఖ్యంగా కాంతిని త్వరగా గ్రహిస్తాయట.

కోడిపుంజుల్లో సిర్కాడియన్ రిథమ్ అనే జీవ గడియారం ఉంటుంది. సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పు కారణంగా.. కోళ్లలోని సిర్కాడియన్ రిథమ్ యాక్టివేట్‌ అవుతుంది. ఇది కోళ్లకు సిగ్నల్ ఇస్తుంది. కోడిపుంజు కళ్లు చాలా షార్ప్‌గా పని చేస్తాయి. వెలుగును చాలా త్వరగా గుర్తిస్తాయి. అందుకే.. సూర్యోదయం సమయంలో వాటి కళ్లు వెలుగును పసిగడుతాయి. మెదడుకు వెలుగు సిగ్నల్స్‌ అందగానే చేరుతుంది. కోడి కూత పెడుతుంది.సూర్యోదయాన్ని పసిగట్టే కోడిపుంజు.. తమ సమూహాన్ని మేల్కొలపడానికి అరుస్తుంది. తద్వారా రోజు ప్రారంభమైందని తమ సహచర కోళ్లకు సంకేతం ఇస్తుందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.