Cyber ​​fraud: ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో సైబర్‌ ఫ్రాడ్స్‌! కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మొదలైనవి) ద్వారా ఆకర్షిస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇళా మోసాలకు పాల్పడుతున్నారు.

Cyber ​​fraud: ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో సైబర్‌ ఫ్రాడ్స్‌! కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు
అదే విధంగా మీ ఫిర్యాదును cybercrime.gov.inలో కూడా నమోదు చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్‌లో ఎలాంటి లోపాలు జరిగినా మోసపోయినట్లు అనుమానం వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ను కచ్చితంగా సేవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Follow us
Ranjith Muppidi

| Edited By: Balaraju Goud

Updated on: Nov 05, 2024 | 12:17 PM

ఇప్పుడంతా స్మార్ట్‌…టెక్నాలజీ మయం! అరచేతిలోనే ప్రపంచం. అవును…టెక్నాలజీ పెరిగింది. కానీ..అదే రేంజ్‌లో సైబర్‌ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో కూర్చొని టెక్నాలజీ సహాయంతో జనాలను ఇట్టే మోసం చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఇన్వెస్ట్‌మెంట్‌, ఇతర పేర్లతో కోట్ల రూపాయలను కొళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనూ సైబర్‌క్రైమ్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. తెలివిగా బ్యాంకు స్టేట్మెంట్స్, ఓటీపీలు రాబట్టి.. అకౌంట్‌లో ఉన్న డబ్బును కొట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి బలయ్యాడు.

వాట్సాప్‌లోని స్టాక్ డిస్కషన్ గ్రూప్‌లో చేరిన ఓ రిటైర్డ్ ఉద్యోగి, నకిలీ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌కు బలయ్యారు. ఈ గ్రూపులో ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, కునల్ సింగ్, లాభదాయకమైన ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులను ప్రచారం చేస్తూ, 2022లో క్రెసెండా స్టాక్ ద్వారా 500% లాభాలు వచ్చినట్టు నమ్మబలికారు. దీంతో ఆకర్షితులైన సదరు పెద్దాయన, ఇన్వెస్టర్ అలయన్స్ గ్రూప్‌లో చేరి 50 లక్షల రూపాయలు పెట్టి స్టాక్‌లు కొనడం ప్రారంభించాడు.

స్కామర్‌లు అనేక పద్ధతులు ఉపయోగించి లాభాలు ఇచ్చే దాని చూపించి, “ప్రివిలేజ్ అకౌంట్స్‌ను తీసుకోవాలని సూచించారు. అతను Skyrim Capital అనే ఫేక్ సంస్థతో అకౌంట్ తెరిచాడు. స్టాక్‌లు కొన్న తర్వాత, కొంతమేర 10-20% లాభాలు సాధించినట్లు జమ చేశారు. కానీ అప్‌పర్ సర్కిట్ల వల్ల కొనలేకపోయారు. ఈ తప్పుడు స్కామర్‌లు, మరిన్ని లాభాలు రావాలంటే కొన్ని పరిమితులను దాటటానికి ప్రివిలేజ్ అకౌంట్స్ పొందాలని చెప్పారు. వాటిలో మళ్లీ భారీ మొత్తంలో డబ్బు పెట్టించారు.

సైబర కేటుగాళ్లు పేర్కొన్న సూచనలను అనుసరించి కొనుగోలు చేయడంతో కొంత లాభాన్ని చూపించారు. ఇక ఆ తర్వాతే అసలు సినిమా చూపించారు. ఆ వెంటనే కోర్సులు నిలిచిపోయాయి. అయినప్పటికీ, Skyrim Capital సిబ్బంది అతనికి అన్ని స్టాక్‌లను విక్రయించి అకౌంట్ మూసేయాలని సూచించారు. దీనిపై అతను అకౌంట్ ఫ్రీజ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అలా కాకుండా ఉండాలంటే మరో 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అతను తన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి స్టాక్స్ విక్రయించి, బ్యాలెన్స్ విడుదల చేయమని అడిగినా, స్కామర్‌లు మరింత డబ్బు చెల్లించాలని పీడించారు. చివరికి మోసపోయానని గ్రహించిన అతను ఆన్‌లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మొదలైనవి) ద్వారా ఆకర్షిస్తున్న కేటుగాళ్లు ఇళా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ పెట్టుబడి స్కీమ్‌లతో అధిక రాబడులు అందిస్తామని, లాభసాటిగా ఉన్న స్క్రీన్‌షాట్లు చూపించి, మొదట చిన్న మొత్తాలు డిపాజిట్ చేసి, నమ్మకాన్ని పొందిన తర్వాత పెద్ద మొత్తాలను డిమాండ్ చేస్తున్నారు మాయగాళ్లు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని పోలీసలు సూచిస్తున్నారు.

భద్రతకు కొన్ని ముఖ్యమైన సూచనలు:

  • ఎప్పుడూ పెట్టుబడి అవకాశాలను SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) రిజిస్టర్ చేసిన ఆర్థిక సలహాదారులతో ధృవీకరించుకోండి.
  • నిర్దిష్ట రాబడుల హామీ ఇచ్చే వాటి మీద ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహారించండి.
  • అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే 1930 డయల్ చేసి లేదా cybercrime.gov.in వద్ద ఫిర్యాదు చేయండి.
  • అత్యవసరమైన సైబర్ క్రైమ్ సమస్యలు ఉంటే 100 లేదా 112 కు కాల్ చేయండి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆసీస్‌ను బెదరగొట్టిన బుమ్రా..మొదటి రోజు హైలెట్స్.. వీడియో
ఆసీస్‌ను బెదరగొట్టిన బుమ్రా..మొదటి రోజు హైలెట్స్.. వీడియో
తెరచుకున్న సంతాన గుహలు.. నిద్ర చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకం
తెరచుకున్న సంతాన గుహలు.. నిద్ర చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకం
తన మొదటి సినిమా టికెట్స్ తానే అమ్మిన రాకింగ్ రాకేష్..వీడియో ఇదిగో
తన మొదటి సినిమా టికెట్స్ తానే అమ్మిన రాకింగ్ రాకేష్..వీడియో ఇదిగో
వాయమ్మో.. కొంప ముంచిన ఎలక్ట్రిక్ బైక్.. కాలిబూడిదైన 4 స్కూటర్లు
వాయమ్మో.. కొంప ముంచిన ఎలక్ట్రిక్ బైక్.. కాలిబూడిదైన 4 స్కూటర్లు
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
తెలంగాణలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది ఇక్కడే
తెలంగాణలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది ఇక్కడే
మృత్యువు పొలికేక.. పిట్టల్లా రాలిపోతున్న యువత! కర్నూలులో మరో ఘోరం
మృత్యువు పొలికేక.. పిట్టల్లా రాలిపోతున్న యువత! కర్నూలులో మరో ఘోరం
ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
ఆలివ్ ఆయిల్‌ని ఇలా ఒంటికి రాస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది!
ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి పుకార్లు.. స్పందించని నేతలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి పుకార్లు.. స్పందించని నేతలు
వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక శక్తి మరింత మెరుగుపడుతుంది
వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక శక్తి మరింత మెరుగుపడుతుంది
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA