New Rules: నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

New Rules: నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

|

Updated on: Nov 05, 2024 | 11:51 AM

నవంబర్‌ వచ్చేసింది. రోజూ వినియోగించే క్రెడిట్‌ కార్డులతో పాటు రైలు టికెట్‌ బుకింగ్‌ విషయంలో ఐఆర్‌సీటీసీ కొత్త మార్పులూ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన ఎఫ్‌డీ సైతం ఈ నెలలోనే ముగియనుంది. ఇలా నవంబర్‌లో వస్తున్న ఆర్థిక మార్పుల వివరాలు ఇవిగో..

క్రెడిట్‌ కార్డుదారులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ షాకిచ్చింది. వివిధ క్రెడిట్‌ కార్డులపై రివార్డు పాయింట్లు తగ్గించింది. గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో చేసే ఖర్చులు, లాంజ్‌ యాక్సెస్‌ రివార్డుపై దీని ప్రభావం పడనుంది. ఫ్యూయల్‌ కొనుగోలుపై విధించే సర్‌ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50 వేల వరకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌ పార్టీ యాప్స్‌ సాయంతో చేసే ఎడ్యుకేషన్‌ ఫీజు చెల్లింపులపై 1 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్‌ 15 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయి.

వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. నవంబరు 1 నుంచి ఈ సిలిండర్లపై రూ.62 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని నవంబర్‌ 1 నుంచి 3.75 శాతానికి పెంచింది. శౌర్య, డిఫెన్స్‌ కార్డులను ఈ పెంపు నుంచి మినహాయించింది. అలాగే, ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో చేసే యుటిలిటీ పేమెంట్లు రూ.50 వేలు దాటితే 1 శాతం సర్‌ఛార్జి వసూలు చేయనుంది. నవంబరు 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. డిసెంబర్‌ 1 నుంచి యుటిలిటీ బిల్లు మొత్తం ₹50 వేలు దాటితే బిల్లు మొత్తానికి సర్‌ఛార్జి బ్యాంక్‌ వసూలు చేయనుంది.

ఇండియన్‌ బ్యాంక్‌ ఐఎన్‌డీ సూపర్‌ 400, ఐఎన్‌డీ సూపర్‌ 300 పేరుతో రెండు కాల వ్యవధులతో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను గతంలో తీసుకొచ్చింది. 300 రోజులకు ఎఫ్‌డీ చేస్తే సాధారణ కస్టమర్లకు 7.05 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్‌ సిటిజన్లకు అయితే 7.55 శాతం వడ్డీని అందిస్తోంది. 400 రోజులకు డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు అత్యధికంగా 7.55 వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. నవంబర్‌ 30తో ఈ ఎఫ్‌డీల గడువు ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబరు 1 నుంచి దేశీయ నగదు బదిలీకి సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్థిక చట్టాలకు ఫైనాన్షియల్‌ సంస్థలు లోబడి, దేశీయ నగదు బదిలీల భద్రతను పెంచేలా ఈ నిబంధనలను రూపొందించింది. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, నగదు చెల్లింపుల వ్యవస్థ మెరుగుపరచడం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయడం ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు