Rules on Gold: బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే..
కేంద్ర ప్రభుత్వం బంగారంపై పన్ను నిబంధనలను మార్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది జూలైలో 2024-25 కోసం పూర్తి బడ్జెట్‌ను సమర్పించినప్పుడు మూలధన లాభాల పన్నుకు సంబంధించిన రూల్స్ ను మార్చారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్నులో ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని పొందని వారు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
బంగారు ఆభరణాల నుంచి డిజిటల్ బంగారం, బంగారు ఈటిఎఫ్‌ల వరకు ప్రతిదానిపై పన్ను చెల్లించాలి. ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు, చైన్‌ల రూపంలో కొత్త బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. కొత్త ఆర్నమెంట్స్ కొన్నప్పుడు బంగారం ధర, ఆభరణాల తయారీ ఛార్జీలను లెక్కించి ట్యాక్స్ వేస్తారు. ఎక్స్ఛేంజ్ పద్ధతిలో పాత బంగారు ఆభరణాలను ఇచ్చేసి కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తే, పాత బంగారాన్ని అమ్మేసినట్టు పరిగణిస్తారు. దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పాత బంగారాన్ని 2 సంవత్సరాల తర్వాత విక్రయించినట్లయితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో ఆభరణాలను తిరిగి అమ్మేస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్.. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసినా పన్ను చెల్లించాలి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అయినా ట్యాక్స్ కట్టాలి. వీటిని కూడా భౌతిక బంగారం మాదిరి స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

