Telangana: మనుషుల మధ్యే కాదు.. మర్కటాల మధ్య లోకల్, నాన్ లోకల్ పంచాయితీ..!
శతమర్కటం...పితలాటకం. కోతుల యుద్ధం మనుషుల చావుకొచ్చింది. మనుషులకే కాదు మర్కటాలకు కూడా గట్టు పంచాయితీలు ఉంటాయి. నేను లోకల్ అంటూ అవి యుద్ధానికి దిగితే ఎట్టా ఉంటాదో తెలుసా? ఓ చిన్న పల్లె సాక్షిగా వేలాది కోతులు సరిహద్దు పంచాయితీపై బస్తీ మే సవాల్ అన్నాయి. ఆ యుద్ధం చూసిన ఊరు గజగజలాడిపోయింది.

శతమర్కటం…పితలాటకం. కోతుల యుద్ధం మనుషుల చావుకొచ్చింది. మనుషులకే కాదు మర్కటాలకు కూడా గట్టు పంచాయితీలు ఉంటాయి. నేను లోకల్ అంటూ అవి యుద్ధానికి దిగితే ఎట్టా ఉంటాదో తెలుసా? ఓ చిన్న పల్లె సాక్షిగా వేలాది కోతులు సరిహద్దు పంచాయితీపై బస్తీ మే సవాల్ అన్నాయి. ఆ యుద్ధం చూసిన ఊరు గజగజలాడిపోయింది.
రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. రెండు ఏరియాల కోతులు ఒకే చోట చేరితే…ఊరంతా పీకి పందిరేశాయి. మా ఏరియాలోకి వస్తారా అంటూ కొత్త కోతులపై పాత కోతుల దండు దాడి చేసింది. ఈ ఈ వానర దండుయాత్రతో ఊరంతా రణరంగంగా మారింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో కోతులు యుద్దానికి దిగాయి. వందలాది కోతులు.. రెండు గ్రూపులుగా సమరమే అంటూ నానా విధ్వంసం సృష్టించాయి.
వెన్కేపల్లి గ్రామంలో ఆల్రెడీ ఓ పెద్ద కోతుల గుంపు తిష్ట వేసి గ్రామస్తులను కాల్చుకు తింటోంది. వాటికి పోటీగా, అక్కడి ఆహారంలో వాటా కోసం మరో పెద్ద కోతుల గుంపు వెన్కేపల్లికి వచ్చింది. దీంతో లోకల్ కోతులు, నాన్ లోకల్ కోతుల గుంపుల మధ్య అతి భీకర యుద్ధం జరిగింది. ఒకదాన్ని ఒకటి రక్కుతూ, కోరలతో పీకుతూ, మంకీస్ గ్యాంగ్ వార్‌కి తెర తీశాయి. అవి యుద్ధం చేయడమే కాకుండా, ఇళ్లల్లోని సామాన్లను చిందరవందర చేసి పారేశాయి.
మనుషుల మధ్యే కాదు.. మర్కటాల మధ్య కూడా ప్రాంతీయ ద్వేషాలు.. లోకల్, నాన్ లోకల్ పంచాయితీలు ఎలా ఉంటాయో ఈ సంఘటనను చూస్తే అర్థమవుతుందంటున్నారు గ్రామస్తులు. ఒక ప్రాంతపు కోతులు మరో ప్రాంతంలో ఆకలి దాడి చేస్తే, అక్కడి కోతులు తిరగబడ్డాయి. కోతుల గోల అండ్ భీకర యుద్ధం చూసి ఊరంతా షాక్ అయింది. వేలాది కోతులు రెండు వర్గాలుగా యుద్ధం చేస్తుంటే, గ్రామస్తులు తలుపులు వేసుకుని ఇళ్లలో దాక్కున్నారు. కాలు బయటపెట్టే సాహసం చేయలేకపోయారు. కనిపిస్తే కరిచివేత అన్నట్లు కోతులు పెట్టిన కర్ఫ్యూతో, 2 గంటల పాటు ఊరి జనం ఇళ్లకే పరిమితమయ్యారు.
2 గంటల వార్ తర్వాత, రెండు గ్రూపులు యుద్ధ విరమణ ప్రకటించడంతో ఊరంతా ఊపిరి పీల్చుకుంది. ఇలా వేలాది కోతులు ఊరి మీద పడితే, తాము ఊళ్లో ఉండే పరిస్థితి లేదని వాపోతున్నారు గ్రామస్తులు. కోతుల బెడదను తొలగించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ మంకీస్ గ్యాంగ్ వార్ చూసి గ్రామస్తులు షాక్ తిన్నారు. ఇలాంటి సంఘటన రియల్ లైఫ్‌లోనే కాదు, సినిమాల్లో కూడా చూడలేదంటున్నారు. కోతుల దాడులను అరికట్టకపోతే, తామే ఊరు ఖాళీ చేసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
అడవిలో ఉండాల్సిన కోతులు ఇప్పుడు గ్రానైట్ క్వారీల కారణంగా కోతులు అడవిని వీడి జనసంచారంలో చేరిపోయాయి. అవి అడవిని విడిచి చాలా ఏళ్లు గడిచింది. ఇక్కడ హంగామా చేస్తున్నాయి. గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగుతున్నాయి. రెండు గ్రూపులు కలిస్తే కిష్కింధ కాండను తలపిస్తోంది. పొరపాటున వాటిని నివారించే ప్రయత్నం చేశామో వెంటపడి మరీ పరుగెత్తిస్తున్నాయి. ఈ సమస్య ప్రతీ గ్రామంలో ఉంది. రెండు గంటల పాటు రెండు వానర గ్రూపుల మధ్య జరిగిన బీకర యుద్ధం నడి రోడ్డుపై వామ్మో అంటూ జనం పరుగులు తీశారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..