AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanthi: సొంత పార్టీ నేతలపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే

విజయశాంతి పార్టీ మారుతున్నారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. అంతేకాదు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా సోనియాగాంధీ విషయంలో కూడా విజయశాంతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా సోనియాగాంధీని అభిమానని అనడంతో ఆమె పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే వీటిపై విజయశాంతి తాజాగా స్పందించింది.

Vijayashanthi: సొంత పార్టీ నేతలపై  విజయశాంతి షాకింగ్ కామెంట్స్.. ఏం చెప్పారంటే
Vijayashanti
Aravind B
|

Updated on: Sep 21, 2023 | 8:22 PM

Share

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతీ పార్టీలో కూడా అంతర్గత కలహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా విజయశాంతి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ మాత్రం ఆగడం లేదని మరోసారి స్పష్టం అయిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి వచ్చిన అనంతంరం దూకుడుగా రాజకీయాలలో ముందుకు వెళ్తానని అనుకున్న విజయశాంతి ఇప్పుడు సొంత పార్టీ పైన తీవ్ర అసహనంతో ఉన్నట్లు ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. ఫైర్ బ్రాండ్, స్టార్ క్యాంపైనర్ గా గుర్తింపు పొందినటువంటి విజయశాంతి ప్రత్యర్థి పార్టీల నాయకులను విమర్శించడంలో తనకు తానే సాటి. అటువంటి విజయశాంతికి ప్రస్తుతం బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల ప్రచారాలు జరిగాయి.

అంతేకాదు.. విజయశాంతి పార్టీ మారుతున్నారన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. అంతేకాదు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా సోనియాగాంధీ విషయంలో కూడా విజయశాంతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా సోనియాగాంధీని అభిమానని అనడంతో ఆమె పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే వీటిపై విజయశాంతి తాజాగా స్పందించింది. ట్వీట్లతో సంచలనం సృష్టించే విజయశాంతి తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఇప్పుడు రాములమ్మ తాజా ట్వీట్‌ కమలంపార్టీలో కలకలం రేపుతోంది. పార్టీలో ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే అంత యాక్టివ్‌గా లేరన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ట్వీట్‌ చేశారు విజయశాంతి. పార్టీలో కొందరు కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అనుమానిస్తున్నారు రాములమ్మ. చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు.. అంటూ ఆ ట్వీట్‌లో అసహనం వ్యక్తంచేశారు విజయశాంతి.

ఇవి కూడా చదవండి

పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 సమావేశంలో తాను స్పష్టంగా తెలియజేశానని ఈ ట్వీట్‌లో ప్రస్తావించారు. ఏం చెప్పానన్నవిషయాలు బయటకు లీకేజీల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకిని అంటూ కొందరు నేతలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌. అన్నీ తెలిసి కూడా మా పార్టీకే చెందిన కొందరు నేతలు పనిగట్టుకుని రాములమ్మ దూరం అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేయిస్తున్నారన్న విజయశాంతి.. అలాంటి ప్రచారం ఖండించదగ్గదంటూ తన స్టయిల్‌లో రియాక్ట్‌ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..