AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day: ‘పార్కుల్లో కనిపిస్తే చర్యలు’.. వాలంటైన్స్‌డేను బహిష్కరించి అమర జవాన్లకు నివాళులర్పిద్దామన్న వీహెచ్‌పీ..

రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని పలు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదని, అదే తేదీన పుల్వామా..

Valentine’s Day: ‘పార్కుల్లో కనిపిస్తే చర్యలు’.. వాలంటైన్స్‌డేను బహిష్కరించి అమర జవాన్లకు నివాళులర్పిద్దామన్న వీహెచ్‌పీ..
Vhp And Bajrang Dal Calls To Valentines Day Boycott
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 07, 2023 | 1:08 PM

Share

మరి కొన్ని రోజులలో వాలంటైన్స్ డే రాబోతుంది. ఈ రోజే వాలంటైన్స్ వీక్ కూడా ప్రారంభమవడంతో.. ఇప్పటికే నవప్రేమికులు తమ ప్రేమను తాము ప్రేమించినవారి ఎదుట ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమవుతున్నారు. అయితే రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని పలు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదని, అదే తేదీన పుల్వామా దాడి(2019)లో చనిపోయిన మన వీర జవాన్లను యువతీయువకులు స్మరించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. ఈ మేరకు వాలంటైన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించాయి. అనంతరం వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ..‘వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దాం. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జవాన్ల గుర్తుగా జరపాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. ప్రజలంతా అమర జవాన్లకు నివాళులు అర్పించాలి. దేశం కోసం పని చేస్తున్న వీర జవాన్లను స్మరించుకోవాలి. ఎవరైనా వాలంటైన్స్ డే జరుపుకొంటే కచ్చితంగా అడ్డుకుంటామ’ని పండరినాథ్ అన్నారు.

అనంతరం భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరామ్ మాట్లాడుతూ ‘‘మా సంస్థల ఆధ్వర్యంలో బ్యాన్ వాలంటైన్స్ డే కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ప్రేమికుల దినోత్సవాన్ని నిషేధిస్తున్నాం. పబ్బులు, హోటళ్లు, పార్కులలో ఎవరైనా ప్రేమికుల రోజున కనిపిస్తే చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా గ్రీటింగ్ కార్డుల దహనం ఉంటుంది. ఫిబ్రవరి 14న అమర జవాన్లను స్మరించుకుని నివాళులు అర్పిద్దాం. దేశభక్తిని చాటుదాం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా(అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.